వైరల్: షేవింగ్ క్రీమ్ అనుకుని హెయిర్ రిమూవల్ క్రీమ్ పట్టించుకున్న ఘనుడు.. చివరకి..?!

చాలా మంది కొన్నింటికి తేడా తెలీకుండా సమస్యల్లో పడుతుంటారు.ముఖం అందంగా కనిపించాలని ఏవేవో క్రీములు వాడుతుంటారు.

 Shaving Cream, Removel Cream, Social Media, Viral News,netizens ,comments-TeluguStop.com

అయితే కొన్నిసార్లు పొరపాటుగానో లేక తెలీయకుండా కొన్ని తప్పులు చేసేస్తుంటారు.దీనివల్ల వారి ముఖాన్ని చెడగొట్టుకుంటుంటారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.షేవింగ్‌ క్రీమ్‌ అనుకుని ఓ యువకుడు పొరపాటున హేయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌ ను ముఖానికి పట్టించుకున్నాడు.

దీంతో ముఖం మీది వెంట్రుకలు చాలా వరకు ఊడిపోయి కార్టూన్‌ క్యారెక్టర్‌ లాగా అందవికారంగా తయారయ్యాడు.

ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌ కు చెందిన రొనాల్డ్‌ వాల్కర్‌ అనే 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల క్రితం గడ్డం చేసుకుందామని టేబుల్‌ డ్రాయర్‌ లోంచి షేవింగ్‌ క్రీమ్‌ ట్యూబ్‌ను బయటకు తీశాడు.అయితే అందులోని క్రీమ్‌ అయిపోయి ఉండటంతో డ్రాయర్‌లో ఉన్న మరో క్రీమ్‌ ట్యూబ్‌ ను బయటకు తీశాడు.

దాన్ని ముఖంపై మొత్తం పూసుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత ముఖం మొత్తం మండటం మొదలైంది.

వెంటనే అతడు తన ముఖాన్ని ఫొటో తీసి సోదరుడికి పంపాడు.అతడి సోదరుడు ఆ ఫొటోను చూసి రొనాల్డ్‌ పూసుకున్నది సేవింగ్‌ క్రీమ్‌ కాదని, హేయిర్‌ రిమూవల్‌ క్రీమ్ అని చెప్పాడు.

అతడు ముఖాన్ని కడుక్కోగా మీసాలు, రెండు కనుబొమ్మలో ఓ కనుబొమ్మ వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి.ఈ సంఘటనను ఫన్నీగా భావించిన రొనాల్డ్‌ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.

దీంతో అతడి ఫొటోలు వైరల్‌ గా మారాయి.దీనిపై ఫేస్‌బుక్‌ వేదికగా రొనాల్డ్‌ స్పందిస్తూ ‘‘నాకు షేవింగ్‌ క్రీమ్‌కు, హేయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌కు తేడా తెలియదు.

ఈ రోజు ఈ రెండికి మధ్య తేడాను చాలా కష్టమైన పద్ధతిలో తెలుసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అయ్యి హల్ చల్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube