సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న థరూర్ మార్ఫింగ్ ఫోటో  

Shashi Tharoor Tweets His Morphed Shakespeare Pic-

సోషల్ మీడియా లో ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇంతకీ ఆ ఫోటో ఎవరిదీ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత,తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.ఆయన సోషల్ మీడియా లో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే...

Shashi Tharoor Tweets His Morphed Shakespeare Pic--Shashi Tharoor Tweets His Morphed Shakespeare Pic-

తాజాగా ఆయన ఒక ఫోటోను ట్వీట్ చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అంత ప్రత్యేకత అని అనుకుంటున్నారా.ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్‌ స్పియర్‌ ఫొటోను ఎవరో మార్ఫింగ్‌ చేసి థరూర్‌కు పంపారు.

అయితే ఆ ఫోటో ను కాస్త ఆయన సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో పెద్ద వైరల్ గా మారింది.

Shashi Tharoor Tweets His Morphed Shakespeare Pic--Shashi Tharoor Tweets His Morphed Shakespeare Pic-

‘వాట్సాప్‌లో తెగ వైరల్‌ అయి ప్రశంసలు దక్కించుకున్న ఫొటో ఇది.ఈ విధంగా నా ఫొటోను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను.దీన్ని సృష్టించడానికి వాళ్లు(ఫొటోను మార్ఫింగ్‌ చేసిన వాళ్లు) చాలా కష్టపడి ఉంటారనుకుంటాను.

ఇది ఎవరు చేశారో వాళ్లకి ధన్యవాదాలు, కానీ నేను మాత్రం షేక్‌స్పియర్‌తో పోల్చకునేంత గొప్ప వ్యక్తిని కాదు’ అంటూ ట్వీట్ చేశారు.అయితే ఒకపక్క వరదలు కేరళ ను అతలాకుతలం చేసేస్తుంటే ఎంపీ గారు ఇలా ఫోటో లు షేర్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు అంటూ నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు.