శశి థరూర్ కి చురకలు అంటించిన అద్నాన్ సమీ

పాకిస్తాన్ లో పుట్టి ఇండియాలో సెటిల్ అయ్యి భారత్ పౌరుడుగా మారిపోయిన ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.ఎప్పటికప్పుడు ఇండియా మీద తన కృతజ్ఞత చూపించుకుంటూ ఉంటాడు.

 Shashi Tharoor Adnan Sami Twitter War, Social Media, Corona Effect, Covid-19, Pm-TeluguStop.com

ఇక మోడీ తీసుకున్న నిర్ణయాలకి మద్దతు ఇస్తూ ఉంటాడు.తాజాగా కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకి మద్దతుగా ప్రజలందరూ ఏకమై మీకు అండగా ఉన్నారు అని చెప్పడానికి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది నిమషాల పాటు విధ్యుత్ దీపాలు ఆర్పేయాలని పిలుపునిచ్చారు.

దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.ఏకంగా దీనిపై రాజకీయ విమర్శలు సైతం కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత శశి థరూర్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు.ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు అకస్మాత్తుగా లైట్ ఆఫ్ చేసి, 9.09 కి ఆన్ చేస్తే ఎలక్ట్రిక్ గ్రిడ్ క్రాష్ అవుతుందని శశి అన్నారు.దీనికి ప్రతిస్పందనగా అద్నాన్ సమీ ప్రజలను ఏకం చేసేందుకే ఈ పని అని అన్నారు.

అయితే శశి థరూర్‌ దీనిపై కాస్త వెటకారంగా అద్నాన్ సమీ మీద కామెంట్స్ చేశారు.మీ సందేశం హిందుస్తానీలో ఉంటే బాగా అర్థం చేసుకునేవాడిని.వెలుగులు ఉన్నప్పుడు ప్రజలను చీకటిలో ఎందుకు ఉంచాలో అర్ధం కావడం లేదన్నారు.అలాగే విద్యుత్ లేకుండా లిఫ్ట్ ఎలా నడుస్తుంది? అని ప్రశ్నించారు.అద్నాన్ సమీ కూడా దీనికి కౌంటర్ గా ట్వీట్ చేశారు.సోదరా మీ మొదటి ట్వీట్ ఆంగ్ల భాషలో ఉన్నందున నేను ఇంగ్లీషులో రాశాను.ఇప్పుడు మీరు హిందీలో ఏది రాసినా, హిందీలో సమాధానం ఇస్తాను.మీ హృదయంలో కాంతిని ఉంచండి.

లిఫ్ట్ గురించి చింతించకండి.కొద్దిసేపటిలో తెరుచుకుంటుంది అని రాశారు.

ఈ ట్వీట్ వార్ లో చాలా మంది అద్నాన్ సమీకి మద్దతుగా, శశి థరూర్ ని ట్రోల్ చేస్తూ కామెంట్లు చేశారు.కాంగ్రెస్ పార్టీ నేతలకి అడిగి మరీ తిట్టించుకోవడం మంచి సరదా అని కొందరు కామెంట్లు పెట్టడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube