శర్వాకు మరో దెబ్బ  

Sharwanandanother Disaster-padi Padi Leche Manasu

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ లక్కేమిటో గాని ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే మరో రెండు సినిమాలతో డిజాస్టర్ అందుకుంటున్నాడు.ఆ డిజాస్టర్ డోస్ కూడా మాములుగా ఉండడం లేదు.నిర్మాతలను నిండా ముంచేస్తున్నాయి...

Sharwanandanother Disaster-padi Padi Leche Manasu-Sharwanandanother Disaster-Padi Padi Leche Manasu

శర్వా శతమానం భవతి సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అనంతరం రాధా సినిమాతో ప్లాప్ అందుకున్నాడు.

Sharwanandanother Disaster-padi Padi Leche Manasu-Sharwanandanother Disaster-Padi Padi Leche Manasu

ఆ తరువాత మహానుభావుడు కాస్త బూస్ట్ ఇచ్చింది.కానీ గత ఏడాది పడి పడి లేచే మనసు మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది.ఆ ఎఫెక్ట్ రణరంగం సినిమాకు కూడా పడింది.

ఓపెనింగ్స్ బాగానే వచ్చినా కూడా ఈ సినిమాతో అయినా శర్వా మెప్పిస్తాడు అనుకుంటే అదే తరహాలో నిరాశపరిచాడని నెగిటివ్ టాక్ వచ్చింది.సినిమాకు రెండవరోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..

పడి పడి లేచే మనసు 10కోట్లకు పైగా నష్టాలను మిగిల్చగా ఇప్పుడు రణరంగం కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.15కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రణరంగం ఇప్పటికి 8కోట్ల షేర్స్ ని కూడా రాబట్టలేదు.పైగా స్క్రీన్స్ కూడా తగ్గుతున్నాయి.

దీంతో సినిమా కలెక్షన్స్ 10కోట్లు కూడా దాటేలా కనిపించడం లేదు.ఈ విధంగా శర్వా కెరీర్ లో వరుసగా రెండు సినిమాలు భారీ నష్టాలతో గట్టి దెబ్బ కొట్టాయనే చెప్పాలి.