కొత్త దర్శకుడుకి ఓకే చెప్పిన శర్వానంద్  

Sharwanand Will Make Movie With Debut Director, Tollywood, Telugu Cinema, Srikaram Movie, UV Creations, - Telugu Sharwanand, Srikaram Movie, Telugu Cinema, Tollywood, Uv Creations

టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శర్వానంద్.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఎప్పుడు కొత్తదనం ఉన్న కంటెంట్ తో సినిమాలు చేస్తున్న శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం, తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీలతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాడు.

TeluguStop.com - Sharwanand Will Make Movie With Debut Director

వరుస ఫ్లాప్ లు ఉన్న శర్వానంద్ సినిమా అవకాశాలు మాత్రం రెండు చేతుల నిండా పుష్కలంగా ఉన్నాయి.ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా వచ్చే ఏడాది శర్వానంద్ సినిమాలు థియేటర్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చే విధంగా కెరియర్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇవి సెట్స్ పైన ఉండగానే శర్వానంద్ కొత్త దర్శకులు చెబుతున్న కథలని వింటున్నాడు.

TeluguStop.com - కొత్త దర్శకుడుకి ఓకే చెప్పిన శర్వానంద్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలోనే శర్వానంద్ ప్రస్తుతం కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రముఖ దర్శకడు దేవాకట్ట దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న శ్రీరామ్‌ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్‌ అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పేశారట.ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది.

రాధేశ్యామ్ తర్వాత యూవీ క్రియేషన్స్ యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.ఈ నేపధ్యంలో మళ్ళీ తమకి మొదటి హిట్ ఇచ్చిన శర్వానంద్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించి కుర్ర దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

#UV Creations #Sharwanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sharwanand Will Make Movie With Debut Director Related Telugu News,Photos/Pics,Images..