వారితో శర్వా నాలుగో సినిమా  

Sharwanand Uv Creations Run Raja Run - Telugu Express Raja, Mahanubhavudu, Run Raja Run, Sharwanand, Uv Creations

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలతో సతమతమవుతున్నాడు.గతంలో ఆయన నటించిన రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో వరుసగా సక్సె్స్‌ను అందుకున్న శర్వా, అటుపై వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 Sharwanand Uv Creations Run Raja Run

చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని సక్సెస్‌గా కూడా మలిచి తన సత్తా చాటుకున్నాడు ఈ హీరో.

అయితే మహానుభావుడు సినిమా యావరేజ్ హిట్‌గా నిలవగా, ఆ తరువాత చేస్తున్న సినిమాలేవీ శర్వానంద్‌కు అదిరిపోయే హిట్‌ను అందించలేకపోయాయి.

వారితో శర్వా నాలుగో సినిమా-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో తన నెక్ట్స్ చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ఈ హీరో.ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాను తెరకెక్కిస్తున్న శర్వా, మరోసారి తనకు అదిరిపోయే హిట్స్ అందించిన యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ బ్యానర్‌లో మూడు సినిమాలు తీసిన శర్వానంద్, తన నాలుగో సినిమాను తీసేందుకు సిద్ధమవుతున్నాడు.అయితే ఈ సినిమాను సంతోష్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం శ్రీకారం సినిమాలో నటిస్తున్న శర్వానంద్, ఆ తరువాత ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని చేయనున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తన తరువాత సినిమా ఉంటుందని శర్వా చెప్పుకొచ్చాడు.

మొత్తానికి శర్వానంద్ తన నెక్ట్స్ చిత్రాలతో అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test