వైరల్ అవుతున్న శర్వానంద్ మేకోవర్ ఫోటోస్..!

ఈ మధ్య కాలంలో కొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు అందులో ముఖ్యంగా హీరో హీరోయిన్లు సినీ దర్శకులు ఎంతోమంది సినిమాలు చేయడం తక్కువ అవడంతో వారి అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎంతోమంది సోషల్ మీడియాలో వారి అభిమానులను పలకరిస్తుంటారు.

 Hero Sharwanand Stylish Look Viral , Sharwanand, Makeover, Photos Going Viral, S-TeluguStop.com

అలాగే కొందరు హీరోయిన్లు కూడా వారికి సంబంధించిన వర్కౌట్స్, అలాగే వారి జీవితంలోని జరిగే సందర్భాలను వారి అభిమానులకు పంచుకుంటూ ఉండటం చూస్తూనే ఉంటాం.అంతే కాదు హీరోయిన్స్ వారికి సంబంధించిన ఫోటో షూట్ ల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు అభిమానులను పలకరిస్తూనే ఉంటారు.

మామూలుగా హీరో అంటే మంచి బాడీ మెయింటెన్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది.బాడీ సంబంధించిన కొన్ని ఫొటోస్ షూటింగ్ జరిపి వాటిని సోషల్ మీడియా ద్వారా వారి అభిమానులకు పంచుకోవడం చూస్తూనే ఉంటాం.

చాలా మంది హీరోలు ఈ ట్రెండ్ చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఈ విషయాన్ని అసలు పట్టించుకోరు.ఇందులో మన టాలీవుడ్ హీరో శర్వానంద్ మాత్రం ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోడనే చెప్పాలి.

ఈయన ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాడు.ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా తన ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకున్నాడు.

తాజాగా ఆయన ఫొటో షూట్ చేసిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.ఈ ఫోటోలలో ఆయన చాలా స్టైలిష్ గా కనపడుతూ ఉండడం గమనించవచ్చు.

శర్వానంద్ చేస్తే ప్రతి కొత్త సినిమా కి ఏదో ఒక వేరియేషన్స్ చూపిస్తూ తన మేక్ఓవర్ లో తేడాలను చూపిస్తూ ఉంటాడు.తాజాగా దిగిన ఫోటో షూట్ లో కూడా తన కొత్త మేక్ ఓవర్ అదరగొట్టారు.

ఈ ఫోటోలను చూస్తే బాగా ట్రెండీ గెటప్ లో చూడగానే ఆకర్షించే విధంగా కనబడుతున్నారు.దీంతో శర్వానంద్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై విజృంభించడానికి రెడీ అయిపోయినట్లు అర్థమవుతోంది.

ఇకపోతే తాజాగా ఆయన ‘ శ్రీకారం ‘ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు.ఆ తర్వాత ‘ మహా సముద్రం’ సినిమా తో మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube