శ్రీకారం టీజర్ టాక్: జుట్టు, మీసం అంటూ రైతు ప్రాముఖ్యతను వివరించిన శర్వా!

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా, ఆ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో, ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

 Sharwanand Sreekaram Teaser Released, Sharwanand, Sreekaram, Priya Arul Mohan, S-TeluguStop.com

ఇక పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల మందుకు వస్తున్న శర్వా, శ్రీకారం చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.

కిషోర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా కథ పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిందని చెప్పేయొచ్చు.

ఇక ఈ టీజర్‌లో శర్వానంద్ పక్కా పల్లెటూరి అబ్బాయిగా మనకు కనిపిస్తున్నాడు.అంతేగాక రైతు-వ్యవసాయం గురించి ప్రేక్షకులను ఆలోచింపజేసే డైలాగుతో టీజర్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ తనదైన అందాల ఆరబోతతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

కాగా ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని, ఇప్పటికే రిలీజ్ అయిన ‘భలేగుంది బాల’ పాట నిరూపించింది.14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన శ్రీకారం చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

ఇక ఈ సినిమాను మార్చి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ చిత్ర టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube