శర్వానంద్ శ్రీకారం రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ యంగ్ హీరోశర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Sharwanand Sreekaram Review And Rating, Sharwanand, Sreekaram, Sreekaram Review-TeluguStop.com

కాగా ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.కిషోర్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమా కథ విలేజ్ నేపథ్యంలో తెరకెక్కిందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో శ్రీకారం చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

Telugu Priyankaarul, Sharwanand, Sreekaram-Latest News - Telugu

శ్రీకారం కథ విషయానికి వస్తే, ఏకాంబరం(సాయి కుమార్) తన ఊళ్లోని రైతులకు అధిక వడ్డీకి డబ్బులిస్తూ వారు కట్టలేని క్రమంలో ఆయా రైతుల భూములను తన పేరిట రాయించుకుంటుంటాడు.ఈ క్రమంలోనే కేశవులు(రావు రమేష్) కూడా ఏకాంబరం వద్ద బాకీ తీసుకోవడంతో, అతడి పొలాన్ని రాయాల్సిందిగా ఏకాంబరం ఒత్తిడి చేస్తాడు.ఈ విషయం తెలుసుకున్న కేశవులు కొడుకు కార్తీక్(శర్వానంద్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తన ఊరికి వస్తాడు.అక్కడ తన తండ్రి బాకీ తీర్చేందుకు కార్తీక్ వ్యవసాయం చేస్తాడు.

ఈ క్రమంలో ఊళ్లో జనం అందరూ పట్నం బాటపడుతుండటంతో వారిని కార్తీక్ ఎలా ఆపాడు? అసలు కార్తీక్ పల్లెటూరికి రావడానికి అసలైన కారణం ఏమిటి? అతడు వ్యవసాయంలో ఎంతమేర రాణిస్తాడు? చివరికి ఏకాంబరం ఏమవుతాడు? అనేది సినిమా కథ.

ఈ సినిమా కథ చాలా రొటీన్ అయినప్పటికీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, మనకు మరోసారి కళ్లకు కట్టినట్లు చూపెట్టారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో వడ్డీ వ్యాపారీగా సాయి కుమార్ నటన అద్బుతంగా ఉంటుంది.ఇక వ్యవసాయం గురించి శర్వానంద్ చెప్పే మాటలు, అతడు వ్యవసాయం కోసం కొత్త పద్ధతులను పాటించడం మిగతా రైతులను ఎలా ప్రభావితం చేసిందనేది మనకు ఈ సినిమాలో చూపించారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ వ్యవసాయం కోసం ఊరికొచ్చిన కొడుకును తండ్రి ఏమంటాడు లాంటి సీన్స్ చాలా ఎమోషనల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో ఉన్న నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు బాగా కలిసొచ్చింది.సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ అని చెప్పాలి.నిర్మాణ విలువలు ఈ సినిమాను బాగా రిచ్‌గా చూపించాయి.

చివరగా: ఎట్టకేలకు శర్వా‌కు హిట్ పడింది!

రేటింగ్: 3.0/5.0

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube