రిలీజ్‌కు శ్రీకారం చుట్టిన శర్వా  

Sharwanand Sreekaram Locks Release Date, Sharwanand, Sreerakaram, Priyanka Arul Mohan, Release Date - Telugu Priyanka Arul Mohan, Release Date, Sharwanand, Sreerakaram

యంగ్ హీరో శర్వానంద్ గతేడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో శర్వా తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

TeluguStop.com - Sharwanand Sreekaram Locks Release Date

కాగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకునేందుకు శర్వా రెడీ అవుతున్నాడు.

కొత్త డైరెక్టర్ కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శర్వా ఓ రైతు పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా కథ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

TeluguStop.com - రిలీజ్‌కు శ్రీకారం చుట్టిన శర్వా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశానికి చిత్ర యూనిట్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టింది.ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాను తొలుత ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా మార్చిలో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని వారు భావించారు.ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన అందాల భామ ప్రియాంకా ఆరుల్ మోహన్ నటిస్తుండటంతో ఈ జంట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.

దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీకారం చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ‘భలేగుంది బాలా’ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి జాను చిత్రం ఫెయిల్యూర్‌తో ఢీలా పడ్డ శర్వా, శ్రీకారం చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక మహాశివరాత్రి కానుకగా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

#Sreerakaram #PriyankaArul #Release Date #Sharwanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు