రెండేళ్లలో ఆరు.. ఏంటి సామీ ఆ స్పీడు!  

Sharwanand 6 Movies in 2 Years, Sharwanand, Sreekaram, Jaanu, Tollywood News - Telugu Jaanu, Sharwanand, Sreekaram, Tollywood News

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్, చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పి్స్తున్నాడు.అయితే శర్వానంద్ మిగతా హీరోలకంటే స్పీడుగా తన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు.

 Sharwanand Sreekaram Jaanu

ఇప్పటికే 2020లో జాను అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన శర్వా, ఇప్పుడు తన కొత్త సినిమా ‘శ్రీకారం’ను కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు.

ఇక ఈ సినిమాను థియేటర్లు తెరుచుకున్న వెంటనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

రెండేళ్లలో ఆరు.. ఏంటి సామీ ఆ స్పీడు-Gossips-Telugu Tollywood Photo Image

కాగా తన నెక్ట్స్ చిత్రాన్ని తెలుగు, తమిళ బైలింగువల్‌గా తెరకెక్కించేందుకు శర్వా రెడీ అయ్యాడు.ఈ సినిమాను ఖైదీ చిత్ర నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు.కాగా ఈ సినిమా తరువాత ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్న ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించనున్నాడు.కాగా ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

కాగా రీసెంట్‌గా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న శర్వా, ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.అటుపై దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు కూడా శర్వానంద్ సిద్ధమయ్యాడు.

ఈ సినిమాలన్నింటినీ 2021 చివరినాటికి రిలీజ్ చేసేందుకు శర్వానంద్ ప్లాన్ చేస్తున్నాడు.మొత్తానికి రెండేళ్లలో ఆరు చిత్రాలను రెడీ చేస్తుండటంతో మిగతా హీరోలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

#Sreekaram #Sharwanand #Jaanu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sharwanand Sreekaram Jaanu Related Telugu News,Photos/Pics,Images..