శర్వానంద్ 'శ్రీకారం' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్..!  

sharwanand sreekaram first look teaser release - Telugu First Glimpse, First Look Teaser, Priyanka Arol, Sharwanand Sreekaram

శర్వానంద్.ఎంత సహజ నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Sharwanand Sreekaram First Look Teaser Release

తీసిన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అతని నటన చూడటం కోసమే వెళ్తారు ప్రేక్షకులు.మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైనా శర్వానంద్ తన నటనతో మంచి హీరోగా ఎదిగాడు.

ఇటీవలే కాలంలో వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి.దీంతో ఇప్పుడు తీసే సినిమాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

ఈ నేపథ్యంలోనే శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న శ్రీకారం సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచగా ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేశారు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంక అరుళ్ మోహన్ శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది

ఇక ఈ సినిమాకు యువ దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ చేస్తే పల్లెటూరి నేపథ్యంలో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది.ఇక సినిమాలో శర్వానంద్ పల్లెటూరి లుక్ లో అదరగొట్టాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది

.

#First Glimpse #Priyanka Arol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sharwanand Sreekaram First Look Teaser Release Related Telugu News,Photos/Pics,Images..