శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం. ఈ సినిమాను ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నారు.
ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు.లేటెస్ట్ గా ఈ సినిమాను అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు.
సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతున్నా డిజిటల్ రైట్స్ తో కూడా సినిమా భారీ రేటు పలికిందని తెలుస్తుంది.శర్వానంద్ సినిమాల్లో ఏ సినిమాకు రాని డిజిటల్ రేటు మహా సముద్రంకి వచ్చినట్టు తెలుస్తుంది.
సినిమాను నెట్ ఫ్లిక్స్ 10.5 కోట్లకు కొనేసిందని టాక్.మహా సముద్రం డిజిటల్ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టేలా ఉంది.ఆల్రెడీ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి శర్వానంద్ సినిమాకు మంచి ప్రాఫిట్స్ వచ్చేలా ఉన్నాయి.జాను.
శ్రీకారం సినిమాలతో కమర్షియల్ సక్సెస్ కు దూరంగా ఉన్న శర్వానంద్ కు ఈ సినిమా అయినా సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి. ఈ సినిమాతో బొమ్మరిల్లు సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.