శర్వానంద్ సింప్లిసిటీ.. ఒకప్పటి హీరోయిన్స్ ఫిదా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉన్నారు.శర్వానంద్ సినిమా అంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

 Sharwanand Serving Food To Radhika And Kushboo At Aadavallu Meeku Johaarlu-TeluguStop.com

శర్వానంద్ చివరి సినిమా” శ్రీకారం” ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోయింది.థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొని శ్రీకారం ఓటీటీలో మాత్రం పరవాలేదనిపించుకుంది.

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో శర్వానంద్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

 Sharwanand Serving Food To Radhika And Kushboo At Aadavallu Meeku Johaarlu-శర్వానంద్ సింప్లిసిటీ.. ఒకప్పటి హీరోయిన్స్ ఫిదా.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శర్వానంద్ హీరోగా ప్రస్తుతం “ఒకే ఒక జీవితం” “ఆడవాళ్లు మీకు జోహార్లు”,”మహా సముద్రం” వంటి సినిమాలలో చేస్తున్నారు.

ఒకే ఒక జీవితం సినిమా గురించి సంబంధించిన అప్డేట్లను చిత్ర బృందం విడుదల చేశారు.కానీ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా ఇదివరకే షూటింగ్ జరుపుకుంది.

కరోనా కారణం చేత ఈ సినిమాకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం చేత తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హీరోయిన్ రష్మిక కూడా భాగమయ్యారు.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని ఫ్యామిలీ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Aadaalloo Meeku Johaarlu, Adavallu Meeku Joharlu Shooting, Kushbu Sundar, Radhika Sarath Kumar, Rashmika, Sharwanand, Sharwanand Simplicity, Tollywood-Movie

ఈ సినిమా షూటింగ్ సెట్లో భాగంగా సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశిలు సందడి చేశారు.ఇక షూటింగ్ తరువాత మధ్యాహ్నం వీరందరికీ హీరో శర్వానంద్ స్వయంగా తన ఇంటి నుంచి తీసుకు వచ్చిన భోజనం వడ్డించారు.ఈ విధంగా తన కేరవాన్ నుంచి వస్తూ వీరందరికీ భోజనం వడ్డించడంతో శర్వానంద్ సింప్లిసిటీ కి ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.

ఇంతకన్నా మంచి శుభారంభం ఇంకేముంటుంది అనగా.ఈ విధంగా హీరో వడ్డిస్తూ మేము తింటూ ఉంటే షూటింగులు ఎప్పుడు సరదాగా సాగిపోతాయి అంటూ రాధిక శర్వానంద్ సింప్లిసిటీ పై ప్రశంసలు కురిపించారు.

#Kushbu Sundar #RadhikaSarath #Rashmika #AdavalluMeeku #AadaallooMeeku

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు