శర్వా మహాసముద్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..!

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈయన ఈ రోజు తన 37 వ పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.

 Sharwanand Maha Samudram Team Shares First Look Poster On His Birthday, Sharwana-TeluguStop.com

ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్ ఇప్పుడు మహా సముద్రం, శ్రీకారం అనే రెండు సినిమాలతో మనందరినీ అలరించడానికి రాబోతున్నాడు.శర్వానంద్ ప్రస్థానం, గమ్యం వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.

ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా మహాసముద్రం పోస్టర్ విడుదల చేసారు.ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ లో శర్వానంద్ బీచ్ దగ్గర ఒక పొడవైన ఆయుధాన్ని పట్టుకుని సీరియస్ లోక్ తో కనిపించాడు.ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

విజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అయితే మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.

చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అతిధి రావు హైదరి అనుఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 19 న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

అయితే శర్వానంద్ చేసిన శ్రీకారం సినిమా ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది.

ఈ ట్రేలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ సినిమాను దర్శకుడు బి కిషోర్ రైతే రాజు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు.

మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

https://twitter.com/baraju_SuperHit/status/1368044163053219841/photo/1

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube