మహేష్ ను కాపీ కొట్టిన శర్వా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..?

యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ కు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

 Sharwanand Copied Mahesh Babu Style In Mahasamudram Movie Poster-TeluguStop.com

శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఈ నెల 11వ తేదీన మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదల కానుండగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాతో పాటు శర్వానంద్ మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

 Sharwanand Copied Mahesh Babu Style In Mahasamudram Movie Poster-మహేష్ ను కాపీ కొట్టిన శర్వా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న శర్వానంద్ బర్త్ డే సందర్భంగా మహాసముద్రం మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ లో శర్వానంద్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ పోస్టర్ ఆరేళ్ల క్రితం విడుదలైన శ్రీమంతుడు సినిమా పోస్టర్ ను పోలి ఉందని కామెంట్లు చేయడంతో పాటు ట్రోల్ చేస్తున్నారు.

మహేష్ బాబును శర్వానంద్ కాపీ కొట్టాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీమంతుడు సినిమా పోస్టర్ లో మహేష్ బాబు స్టైల్ గా రాడ్ పట్టుకుని కనిపించగా శర్వానంద్ సైతం పోస్టర్ లో అలానే కనిపిస్తున్నారు.అయితే కొందరు మహేష్ బాబును ఫాలో అయిన శర్వానంద్ మహా సముద్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడని అభిప్రాయపడుతున్నారు.

మహాసముద్రం సినిమాలో హీరో సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆగష్టు నెల 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఆర్.ఎక్స్ 100 సినిమా తరువాత అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మహాసముద్రం సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా హిట్టైతే అజయ్ భూపతి డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.

#Sharwanand #Copied Style #MahaSamudram #Mahasamudram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు