లాక్ డౌన్ ను ఫుల్లుగా క్యాష్‍ చేసుకుంటున్న శర్వానంద్..?  

sharwanand cashing lock down period with simultaneous movies, sharwanand, lockdown, back to back movies, sharwanand remuneration, career ,movie offers - Telugu Back To Back Movies, Career, Lock Down Period, Lockdown, Movie Offers, Sharwanand, Sharwanand Cashing Lock Down Period With Simultaneous Movies, Sharwanand Remuneration, Simulantaneous Movie, Srikaram Movie

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ ఖాతాలో ఆ రేంజ్ హిట్ రాలేదు.

TeluguStop.com - Sharwanand Cashing Lock Down Period With Simultaneous Movies

పడిపడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు డిజాస్టర్లు కావడంతో శర్వానంద్ మార్కెట్ తగ్గింది.ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటిస్తుండగా ఫ్యామిలీ కథాంశం తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల గతంలోలా స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు సినిమా షూటింగ్ లలో పాల్గొనడం లేదు.ఇప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలేవీ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో శర్వానంద్ శ్రీకారం సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.2021లో కనీసం మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా శర్వానంద్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

TeluguStop.com - లాక్ డౌన్ ను ఫుల్లుగా క్యాష్‍ చేసుకుంటున్న శర్వానంద్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ కంటే తక్కువ మొత్తం రెమ్యునరేషన్ కే శర్వానంద్ నటిస్తూ ఉండటంతో నిర్మాతలు సైతం శర్వానంద్ తో సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విధంగా శర్వానంద్ లాక్ డౌన్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

పారితోషికం కొంత మొత్తం తగ్గించుకున్నా ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఆ విధంగా శర్వానంద్ కు ఎక్కువ మొత్తమే అందుతోంది.

గతంలో ఒక సినిమా పూర్తైన తరువాతే మరో సినిమాకు కమిట్ అయిన శర్వానంద్ ప్రస్తుతం ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు నిర్మాణంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వా నంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంది.ఈ సంవత్సరం శర్వానంద్ నటించిన జాను సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

#Lockdown #BackTo #Career #Sharwanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sharwanand Cashing Lock Down Period With Simultaneous Movies Related Telugu News,Photos/Pics,Images..