శర్వానంద్ మార్కెట్ మరీ ఇంత తక్కువా.. మూడురోజుల్లో ఆడవాళ్లు కలెక్షన్లు ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తే అందుకు భిన్నంగా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.అయితే అటు శర్వానంద్ కు ఇటు రష్మికకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉండటంతో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అందరూ భావించారు.అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయి.

 Sharwanand Aadavallu Meeku Jooharlu Movie First Week Collections Details Here ,-TeluguStop.com

16 కోట్ల రూపాయల టార్గెట్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల కాగా ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా కేవలం 5 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుంది.వీకెండ్ లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తే వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో సులభంగానే అర్థమవుతుంది.ఈ కలెక్షన్లను చూసి శర్వానంద్ మార్కెట్ ఇంత తక్కువా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు రావడం ఖాయమని తేలిపోయింది.శర్వానంద్ భవిష్యత్తు సినిమాలపై కూడా ఈ సినిమా కలెక్షన్ల ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

శర్వానంద్ కథల ఎంపికలో జాగ్రత్త పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో అయినా సక్సెస్ లోకి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శర్వానంద్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శర్వానంద్ తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.శర్వానంద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.శర్వా భవిష్యత్తు సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ఆయన రెమ్యునరేషన్ పై ఎఫెక్ట్ పడుతుంది.

Sharwanand Aadavallu Meeku Jooharlu Movie First Week Collections Details Here

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube