ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.

 Sharwanad Rashmika Mandanna Adavallu Meeku Joharlu Movie Review And Rating Detai-TeluguStop.com

ఇందులో శర్వానంద్, రష్మిక మందన నటీనటులుగా నటించారు.అంతేకాకుండా సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశిలు కూడా నటించారు.

వెన్నెల కిషోర్ కూడా ఇందులో నటించాడు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించాడు.ఇక ఈ రోజు ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ:

ఇక ఈ సినిమాలో శర్వానంద్ చిరు పాత్రలో, రష్మిక మందన ఆధ్య పాత్రల్లో నటించారు.ఇందులో చిరుకు తన పెళ్లి విషయంలో తన కుటుంబ సభ్యుల నుండి బాగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.ఏ పెళ్లి సంబంధం వచ్చిన తన కుటుంబ సభ్యులు తమకు నచ్చలేదని వంకలు చెబుతూ సంబంధాలను తిరస్కరిస్తూ ఉంటారు.

ఆ సమయంలో చిరుకు ఆధ్య పరిచయమవుతుంది.వెంటనే తనని చూసి ప్రేమలో పడతాడు.

ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.కానీ ఆధ్య వాళ్ళ అమ్మ వకుళ (ఖుష్బూ)కు పెళ్లి అంటేనే ఇష్టం ఉండదు.

దీంతో తన తల్లి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెబుతుంది ఆధ్య.చేసేదేమీలేక ఆమె తల్లిని ఒప్పించడానికి ఆమె కంపెనీ లో చేరుతాడు.

ఆ సమయంలో వకుళకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.వాటిని చిరు పరిష్కరిస్తూ ఉంటాడు.

ఇక ఆ సమయంలోనే తనకు పెళ్లి అంటే ఎందుకు ఇష్టం ఉండదో అనే విషయాన్ని చెబుతుంది వకుళ.ఆ తర్వాత చిరు ఏం నిర్ణయం తీసుకుంటాడో.

అసలు పెళ్లి జరుగుతుందా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Adavallumeeku, Kishor Tirumala, Khusboo, Review, Radhika, Sharwanad, Urva

నటినటుల నటన:

శర్వానంద్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.ఇక రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాధిక, ఖుష్బూ, ఊర్వశి తమ పాత్రలలో లీనమయ్యారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ బాగా ఆకట్టుకుంది.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులను ఫిదా చేసింది అని చెప్పవచ్చు.

విశ్లేషణ:

ఇక ఈ సినిమాను డైరెక్టర్ బాగా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు.కానీ ఈ సినిమాలోని కథ కాస్త రొటీన్ గా ఉండటంతో అంతగా కొత్తదనం అనిపించలేదు.

ఫ్యామిలీ పరంగా, ఎమోషనల్ పరంగా కథను బాగా సాగదీశాడు.ఇక సినిమాకు మలుపు లాంటిది లేకపోవటంతో మొత్తం ఎంటర్టైన్మెంట్ గా సాగడంతో కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది.

ఇక ముఖ్యంగా నటీనటుల ఎంపిక ను మాత్రం బాగా ఎంచుకున్నాడు డైరెక్టర్.

Telugu Adavallumeeku, Kishor Tirumala, Khusboo, Review, Radhika, Sharwanad, Urva

ప్లస్ పాయింట్స్:

కామెడీ, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా ఆకట్టుకుంది.సెంటిమెంట్ డైలాగ్స్ పరవాలేదు.మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.నటీనటుల నటన పర్ఫెక్ట్ గా ఉంది.

మైనస్ పాయింట్స్:

కథ గెస్ చేసే విధంగా ఉంది.ఇందులో ఫైటింగ్ లేకపోవటంతో మాస్ ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా, కామెడీ పరంగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube