శర్వానంద్‌ నటించిన 'శ్రీకారం' సెన్సార్‌ టాక్‌.. ఎలా ఉందంటే

యంగ్‌ హీరో శర్వానంద్ శ్రీకారం సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

 Sharvanand Movie Srikaram Censer Report-TeluguStop.com

ఈ సినిమా లో శర్వానంద్‌ యువ రైతుగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా లో మంచి ప్రేమ కథతో పాటు సమాజానికి ఒక మంచి మెసేజ్‌ ను కూడా ఇవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ఇప్పటి వరకు వ్యవసాయం బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా లు చాలా వచ్చాయి.కాని ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఈ సినిమా మరియు ఈ సినిమా లోని శర్వా పాత్ర ఆకట్టుకుంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు.

 Sharvanand Movie Srikaram Censer Report-శర్వానంద్‌ నటించిన శ్రీకారం’ సెన్సార్‌ టాక్‌.. ఎలా ఉందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో అంచనాలు మరింతగా పెంచేందుకు గాను సినిమా సెన్సార్‌ ను కాస్త ముందుగానే చేయించారు.ఈ సినిమా కు సెన్సార్‌ బోర్డు క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు బాగుందంటూ ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది.

సెన్సార్‌ బోర్డు ఈ సినిమా కు చాలా పాజిటివ్‌ గా స్పందించారట.ఈ తరం యువతకు తప్పకుండా చూపించాల్సిన సినిమా అంటూ వారు చిత్ర నిర్మాతలను మరియు నిర్మాతలను అభినందించారట.

ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.శర్వానంద్‌ అభిమానులు చాలా రోజులుగా ఒక సూపర్‌ హిట్ ను ఆశిస్తున్నారు.

గత ఏడాది జాను సినిమా వచ్చినా కూడా అది శర్వా అభిమానులను నిరాశ పర్చింది.దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచుకున్నారు.

శర్వా ఏ పాత్ర చేసినా కూడా అద్బుతంగా చేస్తాడు.కనుక ఈ సినిమా ను కూడా తప్పకుండా రైతులు ఎప్పటికి గుర్తు పెట్టుకునేలా చేసి ఉంటాడంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

#SharvanandNew #Srikaram #Sharvanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు