సినిమా చేస్తావా లేదంటే చావమంటావా అంటూ బెదిరిస్తున్న ఫ్యాన్‌

హీరోలను అప్పుడప్పుడు ఫ్యాన్స్‌ బెదిరించడం చూస్తూనే ఉంటాం.హీరోలు చేసే పనులను కొన్ని సార్లు వారి ఫ్యాన్స్‌ ప్రభావితం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Sharukhan Fans Waiting For His Next Movie Announcement-TeluguStop.com

అంతగా ఫ్యాన్స్‌ హీరోలను ప్రభావితం చేస్తూనే ఉంటారు.హీరోలు ఏం చేసినా, ఏం చేయాలన్నా కూడా వారి అభిమానుల గురించి ఒక సారి ఆలోచించాల్సి ఉంటుంది.

అలా ఆలోచిస్తేనే హీరోలు వారి ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చగలరు.కొన్ని సార్లు హీరోల సినిమాల ఎంపిక విషయంలో ఫ్యాన్స్‌ ఒత్తిడి చాలానే ఉంటుంది.

ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

Telugu Sharukhan Zero, Sharukhan Fans, Sharukhanfans, Zeroutter-

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్‌లను చవిచూస్తూ వస్తున్నాడు.ఏ సినిమా చేసినా కూడా డిజాస్టర్‌గానే నిలుస్తుంది.ఈయన సొంతంగా నిర్మించిన జీరో చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా మరీ దారుణమైన పరాజయం పాలయ్యింది.దాంతో షారుఖ్‌ ఖాన్‌ కొత్త సినిమా చేసేందుకు భయపడుతున్నాడు.

మళ్లీ ఫెయిల్‌ అయితే పరిస్థితి ఏంటీ అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అందుకే కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Sharukhan Zero, Sharukhan Fans, Sharukhanfans, Zeroutter-

షారుఖ్‌ ఖాన్‌ కొత్త సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అంటూ వారు ఎదురు చూస్తుండగా షారుఖ్‌ ఖాన్‌ మాత్రం ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశ్యం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు.దాంతో ఒక అభిమాని జనవరి 1వ తారీకు వరకు షారుఖ్‌ ఖాన్‌ కొత్త సినిమా ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు.ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం అయ్యింది, ఇకపై అయినా వెంటనే షారుఖ్‌ ఖాన్‌ సినిమా మొదలు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశాడు.

మరి అతడి విజ్ఞప్తిని షారుఖ్‌ పట్టించుకుంటాడా లేదా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube