షారుఖ్ కు ‘సన్‘ స్ట్రోక్.. ఆర్యన్ దెబ్బకు తలపట్టుకుంటున్న బాలీవుడ్ బాద్ షా..

Sharukh Khan Movies Halted After Aryan Khan Case

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం బాలీవుడ్ ను షేక్ చేసింది.ఆర్యన్ తో పాటు ఆయన స్నేహేతులను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.

 Sharukh Khan Movies Halted After Aryan Khan Case-TeluguStop.com

పక్కా ఆధారాలతో అతడిని అరెస్టు చేయడంతో బెయిల్ కూడా రావట్లేదు.ప్రస్తుతం ఆర్యన్ జైల్లోనే ఊచలు లెక్కబెడుతున్నాడు.

అంతేకాదు.ఈ కేసు కూడా రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది.

 Sharukh Khan Movies Halted After Aryan Khan Case-షారుఖ్ కు సన్’ స్ట్రోక్.. ఆర్యన్ దెబ్బకు తలపట్టుకుంటున్న బాలీవుడ్ బాద్ షా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు డ్రగ్స్ వాడుతున్నాడు అనే కేసులో అరెస్టు చేసిన అధికారులకు మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తను డ్రగ్స్ వాడటమే కాదు.

సరఫరా కూడా చేస్తున్నట్లు తేలింది.ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ లో లావాదేవీలు నడిపినట్లు వెల్లడైంది.

దీంతో ఈ కేసు మరింత తీవ్రతరం అవుతుంది.ఆర్యన్ ఇప్పట్లో ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.

అటు ఆర్యన్ ను జైలు నుంచి బయటకు ఎలా తీసుకురావాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన తండ్రి షారుఖ్ ఖాన్. అంతేకాదు.ప్రస్తుతం తన సినిమా షూటింగులన్నీ క్యాన్సిల్ చేసి ఆర్యన్ పనిమీదే నిమగ్నం అయ్యాడు.ప్రస్తుతం షారుఖ్ స్పెయిన్ ప‌ఠాన్ లో ఓ సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది.

డైరెక్ట‌ర్ సిద్దార్థ్ ఆనంద్ ఇప్పటికే స్పెయిన్‌కు వెళ్లాడు కూడా.రెండు పాట‌లను తెరకెక్కించేందుకు అక్కడే ఉన్నారు.

కానీ ఆర్యన్ అరెస్టుతో షారుఖ్ వెనక్కి వచ్చాడు.

Telugu Aryan Khan, Aryan Khan, Atlee, Salman Khan, Sharuk Khan, Sharukh Khan, Sharukh Pathan, Sharukhson, Tiger-Movie

అటు ఆట్లీ దర్శకత్వంలో కూడా షారుఖ్ ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు కూడా షారుఖ్ అటెండ్ కావట్లేదు.అటు షారుఖ్ డూపులతో కొన్ని సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక స‌ల్మాన్‌ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా టైగ‌ర్-3.ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

ఈ కేసు మూలంగా ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది.ఆర్యన్ బెయిల్ తర్వాతే షారుఖ్ సినిమా షూటింగులకు హాజరయ్యే అవకాశం ఉంది.

అప్పటి వరకు ఆయన చేస్తున్న సినిమాలన్నీ బ్రేక్ పడే అవకాశం ఉంది.మొత్తంగా ఆర్యన్ వ్యవహారం షారుఖ్ కు పెద్ద నష్టాన్నే కలిగించిందని చెప్పుకోవచ్చు.

#Sharukh Pathan #Aryan Khan #Sharuk Khan #Salman Khan #Atlee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube