సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న స్టార్ హీరో డాటర్…  

Sharukh Khan Daughter Suhana Khan Bollywood Entry - Telugu Gowri Khan, Sharukh Khan Daughter Suhana Khan, Suhana Khan Debut Film, Suhana Khan Heroine, Suhana Khan Movie News

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్

 మరియు అభిమానుల్లో ఆయన కున్నటువంటి క్రేజ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట్లో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తూ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన ఎంతోమందికి ఇప్పటితరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు షారుక్ ఖాన్.

 Sharukh Khan Daughter Suhana Khan Bollywood Entry

అయితే ఇదే సినిమా పరిశ్రమకి చెందిన గౌరీ ఖాన్ నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు.

అయితే

షారుక్ ఖాన్

ఒక పక్క సినిమాలు నటిస్తుంటే ఆయన భార్య మాత్రం బాలీవుడ్ లోని పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న స్టార్ హీరో డాటర్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా షారుక్ ఖాన్ పెద్ద కూతురు

సుహన ఖాన్

చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అంతేగాక సుహన ఖాన్ ఇటీవలే తన చదువులని పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిందని, అంతేగాక తండ్రి బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో ఆయన పేరు నిలబెట్టేందుకుగానూ కృషి చేసేందుకు సన్నద్ధం అవుతోంది.

దీంతో ఇప్పటికే షారుక్ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ దర్శకుడు సుహన ఖాన్ ని బాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.అంతేగాక తొందర్లోనే సుహానా ఖాన్ నటించే చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారికంగా ప్రకటించబడతాయని  పలు వార్తలు

సోషల్ మీడియా

లో బలంగానే వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై సుహానా ఖాన్ తల్లిదండ్రులు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే ఇప్పటికే బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు వెలుగొందిన  హీరో హీరోయిన్ల కూతుర్లు మరియు కొడుకులు ప్రస్తుతం బాగానే రాణిస్తున్నారు.

ఇందులో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, నవ్య నవెలి నంద, అనన్య పాండే, అర్జున్ కపూర్ తదితరులు వరుస అవకాశాలు దక్కించుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

King Khan Daughter Suhana Khan Ready For The Entry To The Bollywood Industry Related Telugu News,Photos/Pics,Images..