షర్మిల సీరియస్ కామెంట్స్..!!

వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ మద్దతుదారులతో, ఆత్మీయులతో “ఆత్మీయ సమ్మేళనం” పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.జిల్లాల వారీగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో భాగంగా తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో  ఈ రోజు భేటీ అయ్యారు.

 Sharmilas Serious Comments, Ys Sharmila, Telangana, Ysr, Mehaboob Nagar-TeluguStop.com

ఈ సందర్భంగా షర్మిల సీరియస్ కామెంట్లు చేశారు.మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాలగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో నాన్నగారు వైయస్ హయాంలో 80శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని,…మరి అలాంటప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను ఇంకా ఇప్పటికి ఎందుకు పూర్తిచేయలేదని పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే రెండు లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారని, మహబూబ్ నగర్ జిల్లా.

కోహినూరు వజ్రం యొక్క జన్మస్థలం.కానీ ఈ జిల్లా ఇప్పుడు కరువు, వలసల జిల్లాల గా మారటం బాధాకరమని పేర్కొన్నారు.

నాన్న అప్పట్లో అనే వారు.తాను చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో.

అన్ని జిల్లాలు పచ్చగా ఉంటాయని, దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్లు అందించినట్లు అవుతుందని.కానీ ప్రస్తుతం జిల్లాలో వలసలు ఆగాయా? అంటూ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు వైయస్ షర్మిల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube