రేవంత్‌పై ష‌ర్మిల సెటైర్లు.. ఆ భ‌య‌మే కార‌ణ‌మా..?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి అనూహ్యంగా ఎంట‌ర్ అయిన వైఎస్ ష‌ర్మిల మొద‌టి నుంచి త‌న తండ్రి పేరు మీద‌నే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.ఆయ‌న అభిమానులే త‌న సైన్యంగా, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను త‌నవైపు తిప్పుకుని రాజ‌కీయాలు చేస్తోంది.

 Sharmila's Satires On Rewanth  Is That The Reason For The Fear   Trs, Sharmila,-TeluguStop.com

కాక‌పోతే ఆమె రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత మాత్రం కాంగ్రెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్‌రెడ్డికి స‌పోర్టుగా ఉంటున్న రెడ్డి సామాజిక వ‌ర్గం ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

దీంతో రేవంత్ కు టీపీసీసీ రావ‌డంతో వారంతా మ‌ళ్లీ రేవంత్‌కు సపోర్టుగా వ‌స్తున్నారు.

ఇదు క్ర‌మంలో రేవంత్‌పై ష‌ర్మిల ఫోక‌స్ పెట్టింది.అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం నాడు నెటిజ‌న్లు అంద‌రూ వైఎస్ షర్మిలకు విషెస్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల తాను సోషల్ మీడియా బిడ్డను అని చెప్తూనే త‌న‌కు ప్ర‌త్యేక సైన్యం లేద‌ని టీఆర్ఎస్, బీజేపీల‌కు కౌంట‌ర్ వేసింది.వైఎస్ అభిమానులే త‌న కార్యకర్తలంటూ స్ప‌ష్టం చేసింది.

Telugu @revanth_anumula, Bandisanjay, Etala Rajendher, Revanth, Sharmila, Ts Con

ఇక ప‌నిలోప‌ని అన్న‌ట్టు పొలిటికల్ డైలాగులు విసిరింది ష‌ర్మిల‌.రీసెంట్ గా టీపీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ రేవంత్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేసింది.టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ టీసీపీసీ ప్రెసిడెంట్‌గా నియ‌మించార‌ని తెల‌పింది.అయితే ఆమె సెటైర్ల వెన‌క ఓ భ‌యం ఉన్న‌ట్టు తెలుస్తోంది.త‌న‌కు అండ‌గా ఉంటార‌నుకున్న రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు అంతా రేవంత్‌కు స‌పోర్టుగా మార‌డంతోనే ఈ విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.దాంతో పాటే త్వ‌ర‌లోనే రేవంత్ నుండి పోటీ లేకుండా చూసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రి ష‌ర్మిల ముంద‌స్తు చ‌ర్య‌లు ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌నేది రేవంత్ రియాక్ష‌న్ ను బ‌ట్టే ఉంటుంది.ఇప్ప‌టికే ష‌ర్మిల‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న రేవంత్ ఈ వాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

చూడాలి మ‌రి ఈ రెడ్డి నేత‌ల పోరు ఎలా ఉంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube