ట్రోల్స్ తోనే పాపులర్ అవుతున్న షర్మిల పార్టీ... ఆ తప్పిదాలే కారణమా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది.కొత్త కొత్త పార్టీలు పుట్టుక రావడంతో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా తయారయిన పరిస్థితి ఉంది.

 Sharmila's Party Is Becoming Popular With Trolls ... Is That The Reason For The-TeluguStop.com

అయితే ఇప్పటికి షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుండి రకరకాల దీక్షల పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ వస్తోంది.అయితే మొదటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం షర్మిల పార్టీని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు.

ఆంధ్రా ప్రాంతానికి చెండియా వ్యక్తి తెలంగాణలో రాజకీయం చేయడం ఏంటని చాలా మంది సామాన్య జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే షర్మిల పార్టీ ప్రజాభిమానంతో పాపులర్ కాకుండా ట్రోల్స్ తో ఎక్కువ పాపులర్ అవుతున్న పరిస్థితి ఉంది.

నల్గొండ జిల్లాలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి కుటుంబాన్ని పరామర్శకు వెళ్తున్న సందర్భంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో షర్మిల తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది.

తాజా మేడ్చల్ లో నిరుద్యోగుల దీక్ష చేపట్టిన సందర్భంలో ఆ దీక్షలో పాల్గొనడానికి అక్కడ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉండే కూలీలనుతీసుకొచ్చిన పరిస్థితి ఉంది.

వారికి ఒక్కొక్కరికి 700 రూపాయలను ఇస్తామని  తీసుకొచ్చారట.కాని వారికి ఇవ్వకపోయే సరికి వారు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఇక నెటిజన్లు షర్మిలను షర్మిల పార్టీని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

ఇలా చాలా రకాలుగా షర్మిల పార్టీ ట్రోల్స్ కు గురవుతూ ఉంది.కొత్తగా ఎదుగుతున్న పార్టీలకు ఇటువంటివి చాలా ప్రమాదకరం.

అయితే పార్టీలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు లేకపోవడం షర్మిల పార్టీకి పెద్ద మైనస్ గా మనం చెప్పుకోవచ్చు.అందుకే అనువజ్ఞులైన రాజకీయ నాయకులు పార్టీలోకి ఆహ్వానిస్తే ఎంతో కొంత పార్టీ రాజకీయాలు సీరియస్ గా మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube