రేవంత్ పై షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు.... అవేంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో  రోజుకో సరికొత్త పార్టీ  పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే.రెండు దఫాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం కేసీఆర్కు  బలమైన ప్రతిపక్షం లేకపోవడమే అనేది సుస్పష్టం.

 Sharmila's Interesting Comments On Rewanth .... What Is That?/revanth Reddy, Tel-TeluguStop.com

ఇప్పుడు రకరకాల పార్టీలు పుట్టుకొచ్చి వైఫల్యాన్ని ప్రజల్లో దీక్షల పేరుతో, నిరసనల పేరుతో ఎండగడుతూ ప్రజల్లో ఎక్కువకాలం వుండేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.అందులో భాగంగా కొత్త వచ్చినటువంటి పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీ షర్మిల  ఆధ్వర్యంలో నడుస్తున్న టువంటి ఈ పార్టీ ఇప్పుడిప్పుడే క్యాడర్ ను నిర్మాణం చేసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తోంది.

షర్మిల ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, ఆంధ్రులకు వ్యతిరేకంగానే తెలంగాణ పోరాటానికి నాంది పలికిన విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, షర్మిల పార్టీకి తెలంగాణలో స్థానం లేదని ఇతర ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్న ప్రస్తుత పరిస్థితులలో, స్వయంగా రేవంత్ రెడ్డి షర్మిల పార్టీ ఒక ఎన్జీవోస్ సంస్థ అని దానిని రాజకీయ పార్టీలా గుర్తించ వద్దని మీడియాను కూడా అన్న పరిస్థితి ఉంది.

తాజాగా రేవంత్ రెడ్డి పై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రేవంత్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతిలో ఉన్నదని కెసిఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అయితే కెసిఆర్ చూసి చూడకుండా ఉంటున్నారని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని షర్మిల వ్యాఖ్యానించింది.,/br>

Telugu Revanth Reddy, Shamila, Sharmila, Telangana, Trs, Ts Congress, Ys Sharmil

షర్మిల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించన్నా సరే ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి వద్దకు ఖచ్చితంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని, సరైన సమయంలో స్పందిస్తారని అయితే మరోవైపు షర్మిల వ్యాఖ్యలు పట్ల రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం లేదని ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పందించి షర్మిలను ఒక రాజకీయ పార్టీగా గుర్తించడం అనవసరమని రేవంత్ భావించే అవకాశం ఉందని సమాచారం.మరి షర్మిల చేసిన ఈ వ్యాఖ్యల దుమారం ఇంకా ఎంత వరకు వెళుతుందనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube