హుజురాబాద్ బై పోల్‌పై షర్మిల ఫోకస్.. అధికార టీఆర్ఎస్‌యే టార్గెట్

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.

 Sharmila's Focus On Huzurabad By Poll  Official Trs Target, Sharmila, Politics,t-TeluguStop.com

రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే తన లక్ష్యమని షర్మిల తెలిపారు.

ఈ క్రమంలోనే షర్మిల హుజురాబాద్ బై పోల్‌పై ఫోకస్ పెట్టింది.హుజురాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారానికి నడుమ సాగుతున్నాయని అప్పట్లో స్పష్టం చేసిన షర్మిల ప్రజెంట్ టీఆర్ఎస్ సర్కారుపై పరోక్ష పోరుకు రెడీ అయింది.

ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆచరణలో పెడుతోంది.

Telugu Congress, Eetala Rajendar, Huzurabad, Sharmila, Tg-Telugu Political News

హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు, యువత బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్‌టీపీ పిలుపునిచ్చింది.ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ సంఖ్యలో నిరుద్యోగులు అభ్యర్థులుగా నామినేషన్ వేసి అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించాలని ప్లాన్ చేశారు.నామినేషన్ వేయాలనుకునే వారు ఉప ఎన్నికల నామినేషన్ కో ఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డిని కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది షర్మిల.తెలంగాణ నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకుగాను ప్రతీ మంగళవారం ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు షర్మిల.

ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు, యువకులకు అండగా నిలబేందుకుగాను ఉప ఎన్నికలో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను హుజురాబాద్ బై పోల్ బరిలో దింపి పరోక్షంగా వారి మద్దతు వైఎస్ఆర్‌టీపీకి ఉండేలా ప్లాన్ చేస్తోంది.అయితే, నిరుద్యోగులు మాత్రమే కాకుండా మిడ్ మానేరు బాధితులు, గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలబడి అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరు జరిపేందుకు సమాయత్తమవుతున్నారు.

మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు తెలంగాణలోని ప్రతిపక్షాలు బాగానే ప్రయత్నిస్తున్నాయి.బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున హుజురాబాద్ అభ్యర్థి ఎవరు అనేది టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంకా ప్రకటించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube