పార్టీ ఆవిష్క‌ర‌ణను ప‌క్కాగా ప్లాన్ చేసిన ష‌ర్మిల‌.. ఒక్క‌రోజులోనే..!

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి రాణించాల‌ని చూస్తున్న ష‌ర్మిల‌కు మొద‌టి నుంచే ఎన్నో ఇబ్బందులు వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే ఆమె సొంత అభిమానులే ఆమె నుంచి దూరం అవుతున్నారు.

 Sharmila, Who Planned The Party Inauguration In A Hurry .. In One Day  Sharmila,-TeluguStop.com

అడ్‌హ‌క్ క‌మిటీల‌కు ఇప్ప‌టికే చాలామంది రాజీనామాలు కూడా చేశారు.ఇక వాటి నుంచి తేరుకున్న ష‌ర్మిల పార్టీని స్థాపించేందుకు ప‌క్కాగా ప్లాన్ వేసుకుని రెడీ అవుతోంది.

ఇందుకోసం అన్ని ర‌కాలుగా అస్త్రాల‌ను రెడీ చేసుకుంటోంది.

ఇక త‌న తండ్రి జ‌యంతి రోజు అయిన జులై 8న ఆమె కొత్త పార్టీని స్టార్ట్ చేస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

ఇందుకోసం ఇప్ప‌టికే భారీ షెడ్యూల్ ను ఆమె రెడీ చేసుకుంటున్నారు.ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే.ష‌ర్మిల జులై 8న ఒక్కరోజులోనే మూడు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల్సి ఉంది.ఎందుకంటే ప్ర‌స్తుతం ఆమె బెంగళూరులోని త‌న నివాసంలో ఉంటున్నారు.

ఆ రోజు అక్క‌డి నుంచి బయలుదే,ఇ రోడ్డు మార్గం ద్వారా కడప జిల్లాలోని వైఎస్సార్ సమాధి వ‌ద్ద‌కు చేరుకుని నివాళులు అర్పిస్తారు.

Telugu Tgpolitics, July, Kadapa, Sharmila, Telengana, Ts Poltics, Ysr Jayanthi-T

ఇక ఇడుపుల పాయ‌లో మార్నింగ్ ఎనిమిదిన్నర గంటల నుంచి ప్రార్థనలు చేసిన త‌ర్వాత కడప జిల్లాలోని విమానాశ్రయానికి బ‌య‌లు దేరి వెళ్తారు.ఇక ఆమె కడప జిల్లా నుంచి ప్రత్యేక చాపర్ విమానంలో బ‌య‌లు దేరి రెండు గంటల వ‌ర‌కు బేగంపేట్‌లోని ఎయిర్ పోర్టులో దిగి అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా వ‌స్తారు.ఇక పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు.

ఆ త‌ర్వాత సాయంత్రం 4గంటల వ‌ర‌కు ఫిలిం సిటీలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దాగ్గ‌ర‌కు భారీ అభిమాన ద‌ళంతో క‌లిసి చేరుకుంటారు.క‌రెక్టుగా ఐదు గంటలకు త‌న కొత్త పార్టీని ప్ర‌క‌టిస్తారు.

ఈ విధంగా ప‌క్కా ప్లాన్ తో ఆమె పార్టీని ఆవిర్భ‌వించేందుకు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube