అన‌వ‌స‌రంగా త‌న ప్లాన్లు బ‌య‌ట పెడుతున్న ష‌ర్మిల‌.. ఇలా అయితే క‌ష్ట‌మే..

ఏ రాజకీయ పార్ట అయినా స‌రే నిల‌దొక్కుకోవాలంటూ త‌న ప్లాన్లు అత్యంత ర‌హ‌స్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే ప్లాన్లు బ‌ట‌య పెట్టుకుంటే ప్ర‌తిప‌క్ష పార్టీలు అల‌ర్ట్ అయిపోయి కౌంట‌ర్లు వేసేస్తాయి.

 Sharmila Who Is Putting Out Her Plans Unnecessarily  But It Is Difficult Sharmil-TeluguStop.com

కానీ ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త‌గా పార్టీ పెట్టిన ష‌ర్మిల మాత్రం ఈ విష‌యంలో చాలా వెన‌క‌బ‌డ్డ‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఆమె పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి సీఎం పదవిని చేపడతానంటూ ఆమె అస‌లు ఎందుకోసం వ‌చ్చిందో బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది.

ఇలా కాకుండా తాను ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నించేందుకు వ‌చ్చానంటే సింప‌తీ అయినా ద‌క్కేది.

అలా కాకుండా కేవ‌లం అధికారం కోస‌మే వ‌చ్చాన‌న్న‌ట్టు చెప్ప‌డంతో అతి పెద్ద తప్పు చేసింద‌ని చెప్పక తప్పదేమో.

ఈ విధంగా ఆమె మాటలు ఉండ‌టంతో షర్మిల తీరును ప్ర‌తిప‌క్షాలు అలాగే ప్ర‌జ‌లు కూడా వేలెత్తి చూపేలా చేస్తున్నాయి.ఇక రీసెంట్ గా తన తండ్రి వైఎస్సార్ వర్థంతి సంద‌ర్భంగా మ‌రోసారి ఆమె త‌న ప్లాన్ ను ఓపెన్‌గానే చెప్పుకున్నారు.

విజయమ్మ ఎంతో క‌ష్ట‌ప‌డి తండ్రి హ‌యాంలోని ముఖ్య నేత‌ల‌ను పిలిపించి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఇది అన్ అఫీషియ‌ల్‌గా కూతురు ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ఇప్పించేందుకు అని అంద‌రికీ తెలిసిందే.

Telugu Cm Kcr, Sharmila, Tg, Ys Vijaymma, Ysrtp-Telugu Political News

అయితే ఈ ఐడియా వరకు బాగానే ఉన్నా షర్మిల ఈ ఆత్మీయ స‌భ‌లో మాట్లాడిన మాటలు మ‌రోసారి ఆమె ముందు చూపును ప్ర‌శ్నించేలా చేశాయి.ఆమె వైఎస్సార్ గురించి మాట్లాడి ఉంటే బాగానే ఉండేది.కానీ ఎక్కువ‌గా త‌ను మాట్లాడిన మాటలన్ని తెలంగాణ రాజ‌కీయాల చుట్టూ తిరిన‌ట్టు క‌నిపిస్తోంది.కేవ‌లం ఈ స‌భ‌ను ఆత్మీయ సభ అన్నంత వరకే నిర్వ‌హించి ఉంటే ఎలాంటి వ్య‌తిరేక‌త రాక‌పోయేది.

అలా కాకుండా మ‌రోసారి తాను తెలంగాణ విషయంలో ఏం కోరుకుంటానన్న విషయాన్ని చెప్ప‌డం మ‌రోసారి ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టాయి.ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించే ఛాన్స‌ప్ ష‌ర్మిల‌నే ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube