వ్యూహం మార్చిన ష‌ర్మిల‌.. వ‌ర్కౌట్ అవుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో వై.ఎస్‌.

 Sharmila Who Changed Strategy  Will There Be A Workout , Sharmila, Ts Politics,l-TeluguStop.com

ష‌ర్మిల ఎంత ట్రై చేసినా క‌లిసి రావ‌ట్లేదు.వ‌స్తూనే నిరుద్యోగ ఎజెండా ఎత్తుకున్నా కూడా యూత్ ఆమె వెంట న‌డిచేందుకు ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు.

ఇక‌పోతే వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్ల‌స్ అవ్వ‌డం ప‌క్క‌న పెడితే ఆమె చేస్తున్న ప‌నుల వ‌ల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావ‌డం గ‌మ‌నార్హం.ఇక త‌న ఎజెండాపై ఇలా ఉంటే లాభం లేద‌ని వ్యూహం మార్చిన‌ట్టు తెలుస్తోంది.

నిరుద్యోగుల తరఫున ఆమె చేస్తున్న దీక్షలు పెద్ద‌గా క‌లిసి రావ‌ట్లేదు.ఇంకా చెప్పాలంటే చిన‌పోయిన నిరుద్యోగుల కుటుంబాలు ష‌ర్మిల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయి.

దీంతో ఆమె వీటికి బ్రేక్ వేసేసి దీనిపై రూటు మార్చుకున్నారు.ఇక ఇండ్ల ద‌గ్గ‌ర దీక్ష‌లు చేయ‌కుండా నేరుగా యూనివర్సిటీల ముందు నిరుద్యోగ దీక్షలు చేయాలని అప్పుడే యూత్ త‌న పార్టీ వైపు మ‌ళ్లుతార‌ని ఆమె భావిస్తున్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు షర్మిల.ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇండ్ల ద‌గ్గ‌ర చేస్తున్న నిరుద్యోగ దీక్షల‌పై వ్య‌తిరేక‌త ఎదురవుతున్న నేప‌థ్యంలో ఆమె దీన్ని ఉప‌సంహ‌రించుకున్నారు.అయితే యూనివ‌ర్సిటీల ద‌గ్గ‌ర కూడా ఎప్పుడు ప‌డితే అప్పుడు దీక్ష‌లు చేయ‌కుండా కేవలం మంగళవారాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నారు.

Telugu Cm Kcr, Sharmila, Tg, Ts, Ysrtp-Telugu Political News

ఇందులో భాగంగా ఈరోజు అన‌గా మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఎదుట త‌న దీక్ష‌ను ప్రారంభించాల‌ని ఆమె అనుకున్నారు.ఇక వ‌చ్చే ప్ర‌తి మంగ‌ళ వారం కూడా అన్ని యూనివ‌ర్సిటీల ముందు దీక్ష‌లు చేయాల‌ని అనుకుంటున్నారు.ఎందుకంటే యూనివ‌ర్సిటీల్లో నిరుద్యోగులు టీఆర్ఎస్ పై ఆగ్ర‌హంతో ఉన్నందున వారిని త‌న పార్టీ వైపు మ‌లుపుకునేందుకు ఈ ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌లో 12 కుటుంబాలను పరామర్శించారు.మ‌రి ష‌ర్మిల కొత్త వ్యూహం ఏ మేర‌కు ప‌ని చేస్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube