ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న షర్మిళ... పట్టించుకునే వారే లేరే

తెలంగాణ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో సరికొత్త పార్టీలకు స్థానం ఉండటంతో ఎలగొలా రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకొస్తున్న పరిస్థితి ఉంది.

 Ys Sharmila Fires On Trs Government, Trs Government, Ys Sharmila,ys Sharmila Tel-TeluguStop.com

ప్రస్తుతం ఇదే తరహాలో తెలంగాణలో ముందుకొస్తున్న నేత వైఎస్ షర్మిళ.తెలంగాణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతిచ్చిన షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను సైతం చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే చాలా వరకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూనే షర్మిల పాదయాత్రతో ముందుకు సాగుతోన్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం చాలా వరకు షర్మిల అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది.

Telugu Sharmila, Telangana, Trs, Ys Sharmila, Ys Sharmila Trs, Yssharmila, Ysrtp

అంతేకాక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే షర్మిల ఇంతలా విమర్శలు చేస్తున్నా కనీసం పట్టించుకునే వారే లేని పరిస్థితి ఉంది.కనీసం విమర్శకు ప్రతి విమర్శ కూడా అధికార పక్షం నుండి రాని పరిస్థితి ఉంది.అయితే దీంతో షర్మిల చేపట్టిన ఏ కార్యక్రమం కూడా అసలు ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది.షర్మిలపై ప్రజలు కానీ యువత కానీ కరెక్ట్ గా ఫోకస్ చేస్తే షర్మిల రాజకీయ క్రీడ తెలంగాణలో సాగే అవకాశం లేదు.

ఎందుకంటే తెలంగాణను పెద్ద ఎత్తున వ్యతిరేకించిన షర్మిల ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆంధ్రావారి పెత్తనాన్ని తెలంగాణలో కొనసాగించడానికి వ్యూహాలు పన్నుతుండటం తెలంగాణ ప్రజల్లో ఒకింత ఆగ్రహాన్ని కలిగిస్తున్న అంశం.అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య విమర్శలే పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతున్న తరుణంలో షర్మిల రాజకీయ విమర్శలు అసలు ఏ ఒక్క ఛోటా కూడా కనీస ప్రస్తావనకు రావడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube