కేసీఆర్‌ను టార్గెట్ చేసిన షర్మిల టీమ్.. ?

తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ స్దాపించాలని ఆలోచనలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో భాగంగా గులాభి పార్టీని ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అంత అషామాషి కాదని గ్రహించినట్లుగా ఉంది.

 Sharmila Team Targeting-TeluguStop.com

అందుకే ఎక్కువగా తెలంగాణ ప్రజల కష్టాల పై ఫోకస్ చేసుకుని తన రాజకీయ మైలేజిని పెంచుకోవాలని చూస్తుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక అంశాలపై దృష్టి సారిస్తూ కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది.

 Sharmila Team Targeting-కేసీఆర్‌ను టార్గెట్ చేసిన షర్మిల టీమ్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈమె టీం కూడా ఏం తక్కువ తినలేదు.అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది.

అయితే తాజాగా కేసీఆర్ ను వైయస్ షర్మిల టీమ్ మరోసారి టార్గెట్ చేసింది.చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు గా కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని ఎంత పోరు పెడుతున్న చీమకుట్టనట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ విమర్శించారు.

ఇకపోతే కరోనా కట్టడికి తక్షణమే నిపుణులతో కమిటీ వేయాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇదే కాకుండా ఆరోగ్య మౌలిక వసతుల కోసం కేంద్ర నుంచి వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో ప్రజలకు తెలిసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పట్టుబట్టారు.

#Peoples Lives #Targeting #Telangana #Sharmila Team #Value

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు