కేసిఆర్ కు షర్మిల ఎన్నో ప్రశ్నలు ! ' దొర ' నో రియాక్షన్ ?

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి, 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం సంపాదించడమే ఏకైక లక్ష్యంగా వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ నిరంతరంగా ఆమె విమర్శలు చేస్తున్నారు.

 Sharmila Sensational Comments On Kcr Kcr, Kutra, Telangana, Congress, Ysartp, Telangana Government, Ysr, Sharmila React Farmer Issue,-TeluguStop.com

తెలంగాణలోని ప్రతి ప్రజా సమస్యపైన షర్మిల స్పందిస్తూ, తన గళాన్ని వినిపిస్తున్నారు.దొర అంటూ కేసీఆర్ ను సంబోధిస్తూ టిఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా టిఆర్ఎస్ నుంచి పెద్దగా రియాక్షన్ అయితే కనిపించడంలేదు.షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోనట్టు గానే ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.

 Sharmila Sensational Comments On Kcr KCR, Kutra, Telangana, Congress, Ysartp, Telangana Government, YSR, Sharmila React Farmer Issue, -కేసిఆర్ కు షర్మిల ఎన్నో ప్రశ్నలు దొర నో రియాక్షన్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడప్పుడు మాత్రమే కొంతమంది నాయకులు కౌంటర్ ఇచ్చినా, షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా ఎన్నికల్లో కనిపించదనే భావంతో టిఆర్ఎస్ పట్టించుకోనట్టు వ్యవహరిస్తోంది.తాజాగా మరోసారి షర్మిల ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విమర్శలు చేశారు.వరంగల్ పర్యటన కేసీఆర్ రద్దు చేసుకోవడం పై ఆమె ఘాటుగా స్పందించారు.‘ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు ? అంటూ షర్మిల ప్రశ్నించారు.వరంగల్ పర్యటన రద్దు కు కారణం,  రైతుల చావులకు కారణం మీరేనని, మిమ్మల్ని అక్కడి ప్రజలు నిలదీస్తారని, కరోనా వస్తుందనా ? లేక ముఖ్యమంత్రి గా మీ బాధ్యత కాదనా ? పర్యటన రద్దు ఎందుకు దొరగారు ? అంటూ షర్మిల విమర్శలు చేశారు.

తెలంగాణ లో పంట వాన పాలు, రైతు కష్టం కన్నీటి పాలు సాయం దొర మాటలకే చాలు ‘ అంటూ షర్మిల విమర్శలు చేశారు.

పంట నష్టపోయి పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఇద్దరు ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతున్నారని , నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రైతులను ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయట పడతలేదా అంటూ షర్మిల ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

Sharmila Sensational Comments On Kcr KCR, Kutra, Telangana, Congress, Ysartp, Telangana Government, YSR, Sharmila React Farmer Issue, - Telugu Congress, Kutra, Sharmila React, Telangana, Ysartp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube