స‌జ్జ‌ల కామెంట్లు బాధ పెట్టాయంటున్న ష‌ర్మిల‌.. ఆ ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌నం కాబోతోందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ష‌ర్మిల అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి అంద‌రికీ ఒక‌టే డౌట్‌.అదే నండి జ‌గ‌న్ తో ష‌ర్మిల‌కు గొడ‌వ‌లు అయ్యాయ‌ని, అందుకే ఆమె తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 Sharmila Says That Sajjalas Comments Are Hurting., Sharmila, Jagan, Sajjala Rama-TeluguStop.com

అయితే దీనిపై ష‌ర్మిల‌ను ప్ర‌శ్నించిన ప్ర‌తి సారి ఆమె అలాంటిదేమీ లేద‌ని చెప్తున్నా వాస్త‌వంగా అది కాద‌న్న విష‌యం కూడా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.అయితే ఇప్పుడు ఆమె ఓ సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

టీడీపీ అనుకూల మీడియాగా ఉన్న ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ‌తో ఆమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పాల్గొన్నారు.

ఇందులో ఆమె సంచ‌ల‌న విష‌యాలు తెలిపిన‌ట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన టీజ‌ర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టాపిక్ అయిపోయింది.పూర్తి ఎపిసోడ్ రేపు ఆదివారం వ‌స్తోంది.

అయితే ఈ టీజ‌ర్‌లో ష‌ర్మిల మాట్లాడుతూ సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్న సంబంధం లేని అనటం బాధ కలిగిందని ష‌ర్మిల తెలిపింది.ఇక తాను ఏపీలో జగన్ రాజకీయంగా ఎద‌గ‌డం కోసం ఆయ‌న భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేశాన‌ని చెప్పుకొచ్చింది.

జ‌గ‌న్ కు రాజ‌కీయంగా అవసరమైనప్పుడల్లా తాను తోడుగా ఉన్నాన‌ని జ‌గ‌న్ కోసం శక్తికి మించి ప‌ని చేయ‌డం అంద‌ర‌కీ తెలుసని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Ap Cm Jagan, Jagan, Jagan Sharmila, Sajjalarama, Sharmila, Telangana, Ysr

ఈ రెండు మాట‌ల‌ను హైలెట్ చేస్తూ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది ఆర్కే మీడియా.స‌జ్జ‌ల ఆమెపై చేసిన వ్యాఖ్య‌ల మీద‌నే ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది.వైసీపీకి ష‌ర్మిల ప్ర‌చారం చేసిన‌ప్పుడు జ‌గ‌న్ త‌ర్వాత అంతా ఆమెనే అయి న‌డిపించారు.

అలాంటి ఆమెను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అలాంటి కామెంట్లు చేసే సాహ‌సం చేస్తారా అనే ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు.కానీ ఆయ‌న జ‌గ‌న్ అండ‌తోనే అలాంటి కామెంట్లు చేశారా అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

మ‌రి పూర్తి ఇంట‌ర్వ్యూ చూస్తేనే విభేదాలు ఎక్కడ మొదలయ్యాయ‌నే దానిపై క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube