ఏపీకి నో అంటున్న షర్మిల ! ఢిల్లీ చర్చల్లో తేలిందేంటి ?

Sharmila Saying No To AP! What Was Revealed In Delhi Discussions, Ap, Ap Politics, Ys Sharmila, Tpcc,ysrtp, Congress, Bjp, Rahul Gandhi, Ys Sharmila, Revanth Reddy, Telangana Congress President,

రాజకీయంగా ముందడుగు వేసే విషయంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( ys sharmila ) ఏ క్లారిటీ కి రావడం లేదు.సొంతంగా పార్టీని ఎన్నికలకు తీసుకువెళ్లే అంత బలం లేకపోవడంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని షర్మిల భావించారు.

 Sharmila Saying No To Ap! What Was Revealed In Delhi Discussions, Ap, Ap Politic-TeluguStop.com

అయితే పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది.షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే షరతును పెట్టింది.

అయితే దీనికి ముందుగా షర్మిల ఒప్పుకున్నా.ఢిల్లీ పెద్దలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు షర్మిలను ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని సూచించారు.

షర్మిల మాత్రం తాను తెలంగాణ రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉంటానని , వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు చెప్పారు.అయితే తాజాగా మరోసారి ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల చర్చించారు .

Telugu Ap, Congress, Rahul Gandhi, Revanth Reddy, Tpcc, Ys Sharmila, Ysrtp-Polit

వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని , తెలంగాణ కాంగ్రెస్( Congress party ) లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని,  ఏపీ రాజకీయాల్లోకి తనను  లాగ వద్దని షర్మిల కండిషన్ పెట్టారట.అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు మాత్రం షర్మిలకు ఏ క్లారిటీ ఇవ్వలేదట.షర్మిల రాకను కాంగ్రెస్ నాయకులు చాలామంది వ్యతిరేకిస్తూ ఉండడం , ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినా,  షర్మిల మాత్రం దానికి అంగీకరించకపోవడంతో ఏం చేయాలనే విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారట.ఇక షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( D.K.Shivakumar )తో చర్చిస్తున్నారట.

Telugu Ap, Congress, Rahul Gandhi, Revanth Reddy, Tpcc, Ys Sharmila, Ysrtp-Polit

 ఏపీ రాజకీయాలతో తనను ముడి పెట్టవద్దని,  తెలంగాణలోనే తాను యాక్టివ్ గా ఉంటానని షర్మిల కండిషన్ పెట్టడంతోనే,  దీనిపై ఇంకా ఏ క్లారిటీ రాలేదట.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తొందరలోనే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube