పీకే కు పెద్ద పరీక్షే పెట్టిన షర్మిల ? 

వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.అందుకే బీజేపీ, కాంగ్రెస్ ల కంటే ఎక్కువగా అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

 Sharmila Put A Big Test To Pk Prasanth Kishore, Pk, Congress, Bjp, Telangana, Tr-TeluguStop.com

  నిరుద్యోగ దీక్షలతో మొదలుపెట్టి పాదయాత్ర వరకు ఆమె పక్కగా ప్లాన్ చేసుకున్నారు.చేవెళ్ల నుంచి ప్రారంభించబోయే పాదయాత్ర ద్వారా , తెలంగాణలో తనకు పూర్తిగా అవకాశం దొరుకుతుందని, రాజకీయ చక్రం తిప్పవచ్చు అని, పాదయాత్ర సమయంలోనే పార్టీలోకి చేరికలు ఉంటాయని షర్మిల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాకపోతే తెలంగాణలో బలంగా ఉన్న టిఆర్ఎస్ ను ఓడించేందుకు ఇప్పటికే బీజేపీ,  కాంగ్రెస్ లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వస్తున్నాయి.ఈ రెండు పార్టీలను దాటుకుని టిఆర్ఎస్ ను ఓడించే స్థాయికి తన పార్టీని తీసుకు వెళ్ళాలనేది షర్మిల లక్ష్యం .ఇది ఆషామాషీగా తేలే వ్యవహారం కాదు కాబట్టి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించి,  తమ పార్టీకి వ్యూహాలు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
        ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఐప్యాక్ టీం షర్మిల పార్టీ లో కీలక బాధ్యతలు పర్యవేక్షించే పనిలో నిమగ్నమైంది.

అలాగే షర్మిల నిర్వహించబోయే పాదయాత్ర కు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు.పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలను,  ప్రసంగాలను ఇప్పటికే సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా, షర్మిల ఏపీ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో తెలంగాణలో ఆమెకు , ఆమె పార్టీకి ఎంతవరకు ఆదరణ దక్కుతుంది అనేది అందరికీ అనుమానంగానే ఉంది.  ఇప్పుడు షర్మిల పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతలు ప్రశాంత్ కిషోర్ పై పడ్డాయి .ఏ మాత్రం బలం బలగం లేని షర్మిల పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు.ఇది ప్రశాంత్ కిషోర్ కు పెద్ద సవాలే.

ఇప్పటి వరకు ఆయన అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసి సక్సెస్ అయ్యారు.ఆయన వ్యూహాలు అందించిన ప్రతి పార్టీ అధికారంలోకి రావడం తోనే , ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
   

Telugu Congress, Analsist, Telangana, Trs, Ys Sharmila, Ysrtp-Telugu Political N

     ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే  అభిప్రాయం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలోనూ నెలకొంది.ఇప్పుడు షర్మిల పార్టీ తరఫున ఆయన టీమ్ పని చేస్తోంది.ఇక్కడా విజయాన్ని నమోదు చేసుకుంటేనే ప్రశాంత్ కిషోర్ క్రెడిబులిటి పెరుగుతుందిం ఇక్కడ కనుక విఫలం అయితే, ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు తగ్గి , ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube