నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో షర్మిల మద్దతు ఏ పార్టీకి ఉండనుందంటే?

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక తరువాత వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అసలు ఏమాత్రం ముందస్తు ప్రకటన లేకుండా తెలంగాణలో పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 Which Party Will Sharmila Support In Nagarjuna Sagar By-election?,sharmila New P-TeluguStop.com

అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేయడమే తమ పార్టీ లక్ష్యమని షర్మిల ప్రకటించింది.అయితే కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అందుకే తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్నానని షర్మిల తెలిపారు.

అయితే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న పరిస్థితులలో షర్మిల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయంపై షర్మిల ఇప్పటివరకు స్పందించకున్నా ఎవరి స్థాయిలో వారు రకరకాలుగా ఊహిస్తున్నారు.

కాని షర్మిల స్వయంగా ప్రకటించే వరకు అవన్నీ ఊహగానాలే అని మనం చెప్పుకోక తప్పదు.అయితే ఇప్పటికే తెలంగాణలోని ప్రతి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమవుతున్న షర్మిల పార్టీ ఏర్పాటుపై నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

అయితే ఆయా సమావేశాల్లో క్షేత్ర స్థాయిలో షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయనే దానిపై విస్తృతంగా చర్చిస్తున్నట్టు సమాచారం.అయితే ఏప్రిల్ లో పార్టీ ఏర్పాటు ముందు వరకు అన్ని రకాలను అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న షర్మిల ఇక తన రాజకీయ సిద్ధాంతాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube