షర్మిల పార్టీ మొదటి అభ్యర్థి ప్రకటన !

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంపై అందరికీ అనేక అనుమానాలు వస్తున్నాయి.ఆ పార్టీ ప్రభావం పెద్దగా తెలంగాణలో కనిపించకపోవడం, మొదట్లో చేరిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకి వెళ్ళిపోతూ ఉండడంతో , రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రభావం తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉంటుందనే అంచనాలు అందరిలోనూ వచ్చేశయి .

 Ys Sharmila Party First Candidate Announcement Epuri Somanna,  Epuri Somanna, Ys-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోకి చేరికలు ఊహించిన స్థాయిలో కనిపించడం లేదు.ఈ పరిణామాలపై షర్మిల తీవ్రంగా కలత చెందుతున్నారు.

ఇటీవల పార్టీ కీలక నాయకురాలు ఇందిరా శోభన్ కూడా రాజీనామా చేయడంతో ఇక పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అందరూ అభిప్రాయపడుతున్నారు.ఈ సమయంలోనే అకస్మాత్తుగా షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు.

తుంగతుర్తి లో దళిత గర్జన సభను పెట్టిన షర్మిల  కళాకారుడు ఏపూరి సోమన్న ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటన చేశారు.ప్రస్తుతం దళిత గర్జన సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఏపూరి సోమన్న చూశారు.

అయితే గత కొంత కాలంగా సోమన్న షర్మిల పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన కూడా ఇందిరా శోభన్ మాదిరిగానే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తారనే ప్రచారం జరిగింది.గతంలోనూ ఏపూరి సోమన్న వివిధ పార్టీల్లో ఉన్నారు.

అయితే ఆయనను కళాకారుడుగానే అందరూ చూశారు తప్ప, రాజకీయ నాయకుడిగా చూడకపోవడంతో ఆయనకు ఏ పార్టీ టిక్కెట్ కేటాయించలేదు.

Telugu Dalitha, Epuri Somanna, Indira Shoban, Sharmila, Ts, Yssharmila, Ysrtp, Y

ప్రస్తుతం పార్టీలో ఉన్న తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో సోమన్న ఉన్న విషయాన్ని గ్రహించి ఆయన బయటకు వెళ్లకుండా షర్మిల ఈ విధంగా కట్టడి చేసినట్టుగా కనిపిస్తోంది.కాకపోతే ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉన్నా, షర్మిల మాత్రం ఈ విధంగా ముందుగా అభ్యర్థిని ప్రకటించి సంచలనమే సృష్టించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube