ఇదేంటి షర్మిలమ్మా ? ఇలా అయితే అధికారంలోకి వచ్చేదెలా ? 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన మాత్రమే కాకుండా 2023 లో కొత్త పార్టీ అధికారంలోకి రావాలని వైయస్ షర్మిల ఎంతగానో ఆశపడుతున్నారు దీనికి తగ్గట్లుగానే మొదట్లో ఆమె హడావుడి ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో కల్పించండి ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తో పాటు కాంగ్రెస్ బిజెపి లాంటి పార్టీలను ఆమె టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు ఇక తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న అన్ని సమస్యల పైన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు లేఖ రాస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే షర్మిల చేస్తున్న విమర్శలకు టిఆర్ఎస్ మొదట్లో స్పందించిన ఆ తరువాత పట్టించుకోవడం పూర్తిగా మానేసింది.

 Ys Sharmila Not Going In The Right Direction, Ys Sharmila, Telangana, Jagan, Trs-TeluguStop.com

అలాగే టిఆర్ఎస్ మినహా మిగతా పార్టీలోని నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతారని , వారి అందరి బలం కాస్త పెరిగిన తరువాత పార్టీ పేరును ప్రకటించి రాజకీయ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.దానికి తగ్గట్టుగా ఆమె కసరత్తు లేకపోవడం, కేవలం విమర్శలతో , లేఖలతో ఆమె కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చాలా ధైర్యంగా వివిధ ఆసుపత్రులను సందర్శిస్తూ, కరోనా సోకిన వారిని పరామర్శిస్తున్నారు.ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వంటివారు , బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ వంటి వారు కరోనా బాధితులకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ హడావుడి చేస్తున్నారు.

అయితే షర్మిల మాత్రం అటువంటి కార్యక్రమాలు ఏవీ చేయడం లేదు.కేవలం లేఖలు రాస్తూ, ప్రభుత్వంపై తాను నిరంతరం పోరాటం చేస్తున్నాను అని నిరూపించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.

Telugu Aravind, Bandi Sanjay, Carona, Cm Kcr, Congress, Corona, Covid, Jagan, Re

ఇక షర్మిల తెలంగాణ అంతటా పాదయాత్ర చేయాలని చూసినా కరోనా, లాక్ డౌన్ నిబంధనలు కారణంగా అది కూడా సాధ్యం కావడం లేదు.ఇలా ఎలా చూసుకున్నా షర్మిల రాజకీయంగా ముందుకు వెళ్లే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అలాగే సరైన రాజకీయ వ్యూహాలు ఆమె వేయలేకపోతున్నట్టు కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube