షర్మిల కు దక్కని మీడియా ఫోకస్ ? కష్టాలు మామూలుగా లేవు ?

వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి తెలంగాణ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్ షర్మిల. అయినా ఆమెకు కాలం కలిసి రావడం లేదు.

 Ys Sharmila Troubling With The Lack Of Media Focus On Ysrtp Party Details, Sharm-TeluguStop.com

కాలం అంటే ఆమెకు మీడియా ఫోకస్ దక్కక పోవడం ఆమెకు,  ఆమె పార్టీకి జనాల నుంచి ఆదరణ పోవడానికి కారణంగా కనిపిస్తోంది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య పైన షర్మిల స్పందిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎన్ని వ్యవహారాలు చేయాలో అన్ని చేస్తున్నారు.ఓదార్పు యాత్రలు,  పరామర్శ యాత్రలు, భరోసా యాత్రలు ఇలా అన్ని రకాల యాత్రలు చేపడుతూ నిత్యం ఉండేలా ప్లాన్ చేసుకుని మరీ ముందుకు వెళ్తున్నారు.

గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వ్యవహరించని విధంగా షర్మిల జనంలోకి దూసుకుపోతున్నారు.  కేవలం బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా వారికి స్వయంగా ఫోన్ నెంబర్ ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సాయం చేసేందుకు అయినా సిద్ధమని భరోసా ఇస్తున్నారు.

ఇలా ఎన్ని రకాలుగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నా,  ఆమె పార్టీలో చేరే వారు పెద్దగా కనిపించడం లేదు.  అలాగే జనాలలోనూ పెద్దగా షర్మిల పార్టీని పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

  దీనికి కారణం ప్రధాన మీడియాతో పాటు , సోషల్ మీడియాలోనూ ఆమెకు సరైన దక్కకపోవడమే.

Telugu Ap Cm Jagan, Bharosa Yatra, Congress, Jagan, Coverage, Sharmila, Trs-Telu

ఏపీలో వైసీపీ  స్థాపించిన మొదట్లో జగన్ జనం లోనే ఎక్కువగా ఉండేవారు.  జనాల సమస్యలపై స్పందిస్తూ నిత్యం అధికార పార్టీ పై పోరాడుతూ ఉండేవారు.2019 ఎన్నికలకు ముందు ఏపీ అంతట పాదయాత్ర నిర్వహించారు.ఆ సమయంలో జగన్ కు మీడియా ఫోకస్ బాగా లభించింది.

అలాగే సోషల్ మీడియాలోనూ పూర్తి స్థాయి లో సహకారం అందడంతో,  జగన్ క్రేజ్ బాగా పెరిగింది.

అదే 175 ఓట్లతో అధికారంలోకి వచ్చేలా చేసింది.కానీ షర్మిల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

మొదట్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి మీడియా ఫోకస్ లభించినా,  రానురాను అది బాగా తగ్గిపోవడంతో  ఆమె ఎన్ని యాత్రలు చేపట్టిన పోరాటాలు చేస్తున్న ఫలితం అయితే కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube