షర్మిలక్క కు ఇక ట్రబుల్స్ తప్పవా ? 

ఎన్నో ఆశలు, ఆశయాలతో తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించారు.రాజన్న రాజ్యం తీసుకొస్తాను అనే నినాదంతో షర్మిల తెలంగాణలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Sharmila Is Key Leader Who Continues To Resign From The Party Ys Sharmila, Ysr,-TeluguStop.com

అధికార పార్టీ టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.ప్రజా ఉద్యమాలు చేపడుతూనే తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ లో ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు షర్మిల రాజకీయ జీవితానికి పెద్ద ముప్పు తీసుకువస్తున్నాయి.అసలు పెద్ద బలం లేదు అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ కు బదిలీ అయ్యేలా కనిపిస్తుండడంతో షర్మిల పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.

         దీనికితోడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పెద్దగా చేరికలు కనిపించలేదు.కీలక నాయకులు ఎవరు ఆ పార్టీలో చేరలేదు.చేరుతారు అనే నమ్మకం కూడా సన్నగిల్లుతోంది.వస్తోంది.

ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే , పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు షర్మిల పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే భయం ఇలా రకరకాల కారణాలతో వరుసగా పార్టీని వీడే నాయకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.తాజాగా వైఎస్సార్ టిపీ లో కీలక నాయకురాలిగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ లేఖను ఆమె అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు తన రాజీనామా కారణాలు కూడా ఆమె వివరించారు.
 

Telugu Indira Soban, Rajashekara, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu Political

  అమరవీరుల ఆశయాల సాధన కోసం అన్నదాతల జీవితంలో ఆనందం కోసం, యువతకు , నిరుద్యోగులకు న్యాయం కోసం,  దళిత బహుజనుల సాధికారత కోసం మైనారిటీ గురుకుల బాగు కోసం గిరిజనులు జీవితాల్లో వెలుగు కోసం, షర్మిలక్క పార్టీ తెలంగాణలో ఉండకూడదని  శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.ఇంకా అనేక మంది కీలక నాయకులు పార్టీని వీడే అవకాశం ఉండడంతో వైఎస్ఆర్ సీపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube