షర్మిల ప్రతిపాదన ను ఆ ప్రొఫెసర్ ఒప్పుకున్నారా  ? 

Sharmila In The Idea Of An Alliance With The Tjs Party

తెలంగాణలో ఏదో రకంగా బలపడాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ప్రధానంగా విమర్శలు చేస్తున్న ఆమె, మరింత దూకుడుగా వ్యవహరించాలని,  తెలంగాణ అంతటా పట్టు పెంచుకుని పెద్ద ఎత్తున పార్టీలోకి వలసలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

 Sharmila In The Idea Of An Alliance With The Tjs Party-TeluguStop.com

ఈ మేరకు చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి మళ్లీ అక్కడే ముగింపు అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.ఇప్పటికే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో షర్మిల జనాల్లో వెళ్తున్నారు.

ప్రతి మంగళవారం చేపడుతున్న ఈ దీక్షల్లో ప్రధానంగా టీఆర్ఎస్ నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
  ఈ విమర్శల కు టీఆర్ఎస్ నుంచి ఎంత ఎక్కువ రెస్పాన్స్ వస్తే అంతగా తమకు కలిసి వస్తుంది అనే లెక్కల్లో షర్మిల ఉంటూ వస్తున్నారు.

 Sharmila In The Idea Of An Alliance With The Tjs Party-షర్మిల ప్రతిపాదనను ఆ ప్రొఫెసర్ ఒప్పుకున్నారా   -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో పోటీ చేసి అధికారంలోకి రావాలి అంటే అది ఒంటరిగా సాధ్యం కాదు అని, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అనే నిర్ణయానికి షర్మిల వచ్చేసారట.ఈ నేపథ్యంలోనే తెలంగాణ జన సమితి తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు రావడంతో పాటు, ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ తో అనేక సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ చర్చల్లో ప్రొఫెసర్ కోదండరామ్ సైతం సానుకూలంగానే  స్పందించారట.
 

Telugu Elections, Kcr, Proffeser Kodandaram, Telangana, Telangana Elections, Tjs Party, Tjs Professor Kodandaram, Trs, Trs Party, Un Employeement Moment, Ys Sharmila, Ys Sharmila Padayatra-Political

అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎన్నికల సమయం నాటికి పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కి పెద్దగా నాయకులు లేకపోవడం, పార్టీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళి పోతూ ఉండటం ఇలా అనేక కారణాలతో షర్మిల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించే ఆలోచనలో ఉండడంతో ఆ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఆధారంగానే పార్టీలో మార్పు చేర్పులు ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

#Telangana #Trs #YSSharmila #TjsProfessor #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube