పార్టీ క్యాడర్ పై ఫోకస్ పెట్టిన షర్మిల...అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తానంటూ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల మెల్ల మెల్లగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.పై స్థాయిలో ఎంత ఉద్యమాలు చేసినా క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజాభిమానం పొందేది కార్యకర్తల పోరాటాల వల్లే.

 Sharmila Focused On The Party Cadre This Is The Real Strategy-TeluguStop.com

అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్త యువజన సభ్యులను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించింది.ఇక నియోజకవర్గాల వారీగా బలమైన కార్యకర్తల నిర్మాణం చేపడుతూ వచ్చే ఎన్నికలకు కార్యాచరణను ఇప్పటి నుండే సిద్దం చేసుకుంటోంది.

అందులో భాగంగానే పార్లమెంట్ కన్వీనర్ లను, రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్ లను ననియమించింది.దీంతో పార్టీలో వీరు యాక్టివ్ గా ఉండటమే కాకుండా యువగళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారు.

 Sharmila Focused On The Party Cadre This Is The Real Strategy-పార్టీ క్యాడర్ పై ఫోకస్ పెట్టిన షర్మిల…అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక యువ నాయకులను ఎంతగా ప్రోత్సహిస్తే కార్యకర్తల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చాలా వేగంగా జరుగుతోంది.

యువనాయకులే తమ వెంట కార్యకర్తలను నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు.

అయితే ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో షర్మిల వాయిస్ తప్ప వేరే నేత వాయిస్ బయటికి విన్పించిన దాఖలాలే లేవు.మీడియాలో పార్టీపరంగా ప్రతినిధులు ఉండడం ద్వారా మీడియాలో కూడా అధికార పార్టీని వైఫ్యల్యాలను తమదైన శైలిలో ఖండించేందుకు ఒక అవకాశం దొరుకుతుంది.

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమై పోరాడుతున్న పరిస్థితులలో ఎంతో కొంత కీలకపాత్ర పోషించకపోతే ప్రజాభిమానాన్ని పొందడం చాలా కష్టం.అంతేకాక కాంగ్రెస్ లాంటి పార్టీ  వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఒక ఎన్జీవో గా అభివర్ణిస్తున్న తరుణంలో కనీసం ప్రతిపక్షాలు అయినా గుర్తించాలంటే ఎంతో కొంత రాష్ట్రంలో తమ పార్టీ ప్రభావాన్ని చూపించాలి.

లేకుంటే స్వంతంగా పార్టీ క్యాడర్ ద్వారా అయినా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.మరి భవిష్యత్తులో షర్మిల తన పార్టీ ప్రజాభిమానం పొందేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

#Sharmila Cader #Trs #Poltics #Ysr Telengan #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు