వరుస దీక్షలకు పిలుపునిస్తున్న షర్మిల... అసలు వ్యూహం ఇదే?

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పార్టీని ప్రకటించిన తరువాత ఇక యాక్టివ్ గా ముందుకెల్తోంది.అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణలో అందరి ప్రతిపక్షాల రూట్ లోనే షర్మిల ముందుకెళ్ళనుందనే సంకేతాలిస్తోంది.

 Sharmila Calling For A Series Of Initiations Is This The Real Strategy-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలపై అవగాహన పెంచుకుంటూ అధికార పక్షం టార్గెట్ గా ముందుకెళ్తోంది.అయితే తాజాగా నిరుద్యోగుల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.తెలంగాణలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పేరుగుతుందే గాని తగ్గడం లేదని షర్మిల మొదటి నుండి ఘాటుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ దీక్షలు చేపట్టడం వెనుక ఉన్న ప్రధాన వ్యూహం ఏంటని ఒక్కసారి గమనిస్తే దీక్షల ద్వారా చేపట్టిన రోజు మొత్తం ప్రభుత్వంపై రకరకాల రీతిలో విమర్శించడానికి అవకాశం ఉంటుంది.

 Sharmila Calling For A Series Of Initiations Is This The Real Strategy-వరుస దీక్షలకు పిలుపునిస్తున్న షర్మిల… అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తద్వారా ప్రభుత్వం స్పందించే అవకాశం చాలా ఎక్కువ.అంతేకాక వరుస దీక్షల ద్వారా ఎక్కువ సమయం వార్తలలో  ఉండే అవకాశం ఉంది.తద్వారా పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కావున షర్మిల దీక్షల వ్యూహాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే నేడు చేపట్టిన నిరుద్యోగుల దీక్షపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

#Ts Poltics #Ysr Telengana #YS Sharmila #Sharmila #Initiations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు