మళ్ళీ గొంతెత్తిన షర్మిల... పార్ట్ టైం రాజకీయమంటూ మొదలైన విమర్శలు

తెలంగాణ రాజకీయాలలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన వై.ఎస్.షర్మిల రాజకీయ వ్యూహం, రాజకీయం గాని ఎవరికీ అంతుపట్టకుండా అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది.అసలు నిజంగా రాజకీయం చేద్దామని వచ్చిందా లేక ఎవరి చేతుల్లో అయినా అస్త్రంగా మారి వచ్చిందా అన్నది పక్కకు పెడితే ఇప్పటి వరకు ఒక్క 72 గంటల దీక్ష తప్ప మరేమీ చేపట్టలేదు.

 Ys Sharmila Angry On Kcr Politics Over Nursing Posts, Ys Sharmila,  Kcr Politics-TeluguStop.com

అయితే ఇక ఆ తరువాత ఏమీ మాట్లాడని షర్మిల తాజాగా పోస్టింగ్స్ రాని నర్సింగ్ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేసీఆర్ పై నిప్పులు చెరిగింది.వారి సమస్యలను సావధానంగా విన్న షర్మిల జరిగిన నష్టాన్ని పూర్తిగా తెలుసుకుంది.

కెసీఆర్ నీది గుండెనా…బండనా వీరి బాధలు నీకు కనిపించవా అంటూ షర్మిల కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం.అదిగో,ఇదిగో అంటూ ఊరించిన కెసీఆర్ ఇలా పోస్టింగ్స్ ఇవ్వకుండా వారిని వేధించడం మీకు తగునా అంటూ షర్మిల వ్యాఖ్యానించింది.తక్షణమే పోస్టింగ్స్ రాని నర్సింగ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేసింది.

షర్మిల ఇలా ఎపుడో ఒకప్పుడు ఏదో ఒక సమస్యపై స్పందిస్తూ పార్ట్ టైం పొలిటీషియన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube