వైసీపీ నుంచి రాజ్యసభకు షర్మిల, చిరంజీవి ఇంకా ?

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సందడి ఎక్కువగా కనిపిస్తోంది.వచ్చే నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.

 Sharmila And Chiranjeevi From Ycp To Rajya Sabha-TeluguStop.com

ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారి విషయంలో ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం వైసీపీకి ఉన్న శాసనసభ్యుల బలంతో మొత్తం నాలుగు సీట్లు వైసీపీకి రాజ్యసభలో దక్కబోతున్నాయి.

ఈ నాలుగు ఖాళీలను జగన్ ఏ విధంగా భర్తీ చేస్తారు అనే విషయంపైనే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.ఇప్పటికే రెండు స్థానాల్లో మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

శాసన మండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ లో బిల్లు పాస్ చేయడం వచ్చే నెలలో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కూడా ఆ బిల్లును ఆమోదించే అవకాశం ఉండడంతో ఈ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే ఈ ఇద్దరినీ రాజ్యసభకు పంపించాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

Telugu Apcm, Chiranjeevimeet, Jagan Sharmila, Mekapatiraja, Sharmilaactive-Polit

మరో రెండు సీట్లలో ఎవరికి జగన్ అవకాశం కల్పిస్తారు అనేది ఆసక్తిగా మారింది.ఇప్పటికే వైసిపి తో సన్నిహితంగా ఉంటున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా రాజ్యసభ స్థానాల్లో తమకు అవకాశం కల్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం.బీజేపీకి రాజ్యసభలో బలం చాలా అవసరం.గతంలో సురేష్ ప్రభు, నిర్మల సిత్రమం వంటి వారు టిడిపి హయాంలో రాజ్యసభకు వెళ్లారు.ఇప్పుడు కూడా ఆ విధంగానే రెండు సీట్లలో అవకాశం కల్పించాల్సిందిగా బిజెపి కోరినట్లు తెలుస్తోంది.అయితే ఇదే సమయంలో జగన్ సోదరి వైఎస్ షర్మిల ను రాజ్యసభకు పంపించాలని పార్టీ నాయకులు జగన్ ను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

షర్మిలను పొలిటికల్ గా యాక్టివ్ చేయడం ద్వారా వైసీపీలో కొత్త ఉత్సాహం వస్తుందని, అదే సమయంలో ప్రతిపక్షాలను ధీటుగా విమర్శించడానికి కూడా షర్మిల ఉపయోగపడుతుందని జగన్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆమె నిర్వహించిన పాదయాత్ర ,ఎన్నికల ప్రచారంలోనూ వచ్చిన రెస్పాన్స్ ప్రకారం చూసినా ఆమెకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే తనకు కూడా అవకాశం కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా జగన్ ను కోరినట్లు తెలుస్తోంది.

Telugu Apcm, Chiranjeevimeet, Jagan Sharmila, Mekapatiraja, Sharmilaactive-Polit

ఇటీవలే ఆయన జగన్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.అలాగే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన రాంకీ గ్రూప్స్ అధినేత అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన బీదా మస్తాన్ రావు వంటి వారి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.ఇక చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా రాజ్యసభ కు పంపిస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

అయితే జగన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి విఏసీపీ నాయకుల్లో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube