ఆ సమయంలో నేను మద్యం తాగలేదంటున్న అల్లరి నరేష్ హీరోయిన్…  

Sharmiela Mandre Car Accident News Tollywood Actress Allari Naresh - Telugu Allari Naresh, Car Accident News, Sharmiela Mandre, Sharmiela Mandre Car Accident News, Tollywood Actress

2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్ దర్శకత్వం వహించినటువంటి కెవ్వు కేక చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, షర్మిల మాండ్రే నటించారు.

 Sharmiela Mandre Car Accident News Tollywood Actress Allari Naresh

తాజాగా షర్మిలా మాండ్రే రాత్రిపూట పార్టీకి వెళ్లి వస్తూ ఎక్కువ స్పీడ్ తో కారు నడుపుతూ ప్రమాదానికి గురైంది. అయితేఈ విషయానికి సంబంధించి ఓ వార్త నెట్లో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే షర్మిల మాండ్రే పార్టీ కి వెళ్లి వస్తూ ఉండగా మద్యం సేవించి ఉందని అందువల్ల సోయి లేకుండా కారు నడపడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టిందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.దీంతో తాజాగా ఈ వార్తలపై నటి షర్మిలా మాండ్రే స్పందించింది.

ఆ సమయంలో నేను మద్యం తాగలేదంటున్న అల్లరి నరేష్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎటువంటి నిజం లేదని కొట్టిపారేసింది. అంతేగాక ఆ సమయంలో తాను పార్టీకి వెళ్లలేదని చిన్నపాటి అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రికి వెళ్లి వస్తున్నానని, అంతేగాక కారు ప్రమాదం జరిగిన సమయంలో తాను కారు నడపలేదని తన స్నేహితుడు నడిపాడని చెప్పుకొచ్చింది.

నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంకోసారి ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి కెవ్వు కేక చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ తమిళం కన్నడలో అవకాశాలు రావడంతో వెంటనే తన మకాం మార్చింది.

ఇందులో భాగంగా వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకు నోచుకోలేదు.అయితే కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా ఈ అమ్మడు వ్యవహరించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Sharmila Mandre React About Her Car Accident News Related Telugu News,Photos/Pics,Images..