షర్మిలకు కలిసిరాని కాలం ! పట్టించుకునేవారేరి ?

ఎన్నో ఎన్నెన్నో అంచనాలు, ఆశలతో షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా, అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి.ఆమె పార్టీ పెట్టకుండానే పాపులర్ అవ్వాలని , షర్మిల అభిప్రాయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

 Sharma Is Facing Many Difficulties Politically-TeluguStop.com

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అనే అభిప్రాయం కలిగించాలనే ఉద్దేశం లో ఆమె ఉన్నా, ఉన్న దానికి తగ్గట్లుగానే అవసరం ఉన్నా లేకపోయినా , టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.ఈ  విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ స్పందిస్తున్నారు.

అతి త్వరలోనే పార్టీ పేరును ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఆ లోపుగా పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని భారీ జన సందోహం మధ్య పార్టీ పేరును ప్రకటించాలని చూస్తున్నారు.

 Sharma Is Facing Many Difficulties Politically-షర్మిలకు కలిసిరాని కాలం పట్టించుకునేవారేరి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆమె పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు.దీనికి కారణం షర్మిల రాజకీయ వ్యవహారాలపై ఒక వ్యూహం లేకపోవడం,  కేవలం టిఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకు ఆమె పార్టీ పెత్తి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.

తెలంగాణ జనం షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, పెద్దగా స్పందన కనిపించడం లేదు.ఇటీవల నిరుద్యోగుల కోసం ఆమె దీక్ష చేపట్టారు.అయినా పెద్దగా స్పందన కనిపించలేదు.ఇక రాజకీయంగా మరింత దూకుడు ప్రదర్శించాలని తెలంగాణ అంతా పాదయాత్ర నిర్వహించాలని ఆమె ప్రయత్నాలు చేసుకుంటున్న సమయంలో తెలంగాణలో కరోనా  విజృంభిస్తుండడంతో,  ఆమె కాలు బయట పెట్టే అవకాశం లేకుండా పోయింది.

దీంతో ఆమె వేసుకున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఒక్కసారిగా దెబ్బతిన్నాయి.షర్మిల పార్టీ ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్లుగా వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది.

పదే పదే టీఆర్ఎస్ కీలక నేతలను,  ప్రభుత్వాన్ని షర్మిల విమర్శిస్తున్న, టిఆర్ఎస్ పెద్దగా స్పందించడం లేదు.

 కరోనా విషయంలోనూ,  లాక్ డౌన్ వంటి వాటిపైన షర్మిల స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు .ఈ విషయంలో ముఖ్యంగా కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న , ఆమెను పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇక పార్టీలో చేరికలు సైతం ఎంతకు అంతే అన్నట్టుగా ఉండడంతో,  షర్మిల పార్టీ పై ఎవరికీ పెద్దగా ఆశలు అయితే కనిపించడం లేదు

.

#Telangana #Jagan #Ysrcp #Trs Party #YS Sharmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు