కోవిడ్ వ్యాక్సిన్‌ తయారీలో షార్క్‌ చేపల కాలేయం..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.

 Shark Liver For Covid Vaccine Preparation,shark Fish, Liver, Manufacture,  Covid-TeluguStop.com

మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ మహమ్మారి ఎప్పుడు ఎలా సోకుతుందో ఎవరికీ తెలియడం లేదు.

సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధిలు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు.అయితే ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.ఇప్పటికే ఈ మహమ్మారికి వ్యాక్సిన్ సంబంధిచిన ట్రైయల్స్ జరుగుతూనే ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ తయారీపై సంచలన విషయాలు బయటకి వచ్చాయి.అయితే కరోనా వ్యాక్సిన్‌ తయారీలో షార్క్ చేపల  కాలేయం నుండి తీసిన నూనెను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

అయితే స్క్వాలిన్‌ పేరుతో పిలిచే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు.ఇక అందుకోసమే షార్క్‌ చేపల కాలేయ వాడకం పెరిగిందని తెలిపారు.

దీనికి సంబంధించిన కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ తెలియజేసింది.ఇక ఇప్పటికే ఈ స్వ్కాలిన్‌ను బ్రిటన్‌కు చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీ ఫ్లూ వ్యాక్సిన్‌లతయారీలో వాడుతున్నట్లు తెలిపారు.

అయితే మూడు వేల పెద్ద షార్క్‌ చేప నుండి టన్ను స్క్వాలిన్ వస్తుందని తెలిపారు.అయితే ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన జనాభాకు దీన్ని ఉపయోగించి చేసిన టీకా ఇవ్వాలంటే ఐదులక్షల షార్క్‌లు కావాలని నిపుణులు తెలిపారు.

ఇక ఈ నూనెను ఎక్కువగా ఉండే గుల్పర్‌ షార్క్‌, బాస్కింగ్‌ షార్క్‌ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube